Viral Video: ఫోటోలు దిగడం ఫ్యాషన్ కాదు.. అదో మధుర జ్ఞాపకం..! తాజ్‌మహల్ ప్రేమకు చిహ్నంగా..
తాజ్‌మహల్ వద్ద ఒక జంట కీప్యాడ్ ఫోన్‌తో ఫోటోలు తీసుకుంటున్న వీడియో వైరల్‌గా మారింది. ప్రేమ చిహ్నం తాజ్‌మహల్ ముందు నాణ్యత కంటే జ్ఞాపకాలే ముఖ్యమని ఈ ఘటన చాటింది. వ్లాగర్ సహాయంతో ఆ జంట తమ అమూల్యమైన క్షణాలను బంధించారు. ఇది సోషల్ మీడియాలో లక్షలాది మంది హృదయాలను కదిలించింది. ఫోటోలు కేవలం ప్రదర్శన కోసం కాదని, జ్ఞాపకాల కోసం అని ఈ వీడియో స్పష్టం చేసింది.

భారతదేశ సాంస్కృతిక వారసత్వం, ప్రపంచంలోని 7వ అద్భుతం అయిన తాజ్ మహల్ దాని అందానికి ప్రసిద్ధి చెందింది. తాజ్‌మహల్ ప్రేమ చిహ్నం అని కూడా పిలుస్తారు. అందుకే ఇది ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఇక్కడకు వచ్చిన పర్యాటకులు, ప్రేమికులు ఆ మధుర క్షణాలను ఫోటోలు, వీడియోలు తీసుకుని పదిలంగా దాచుకుంటారు. కానీ, ప్రతి ఒక్కరి వద్ద కెమెరాలు, ఖరీదైన టచ్‌స్క్రీన్ స్మార్ట్‌ఫోన్ ఉండదు. అలాంటి వారు తమ జ్ఞాపకాలను భద్రపరచుకోవడానికి నాణ్యత కంటే వారి ప్రేమ గొప్పది అని చాటుతుంటారు. తాజ్‌మహల్ వద్ద ఫోటోలు దిగడం అనేది ప్రదర్శన కోసం కాదని, జ్ఞాపకాలను కాపాడుకోవడానికి అని తెలియజేస్తున్న ఒక వీడియో ఇప్పుడు ఇంటర్‌నెట్‌లో అందరి హృదయాలను కదిలిస్తోంది.
ఫోటోలు అంటే ఫిల్టర్లు, కెమెరా నాణ్యత, నచ్చిన ఫ్రేమ్‌లతో నడిచే నేటి యుగంలో తాజ్ మహల్ నుండి వచ్చిన ఒక చిన్న వీడియో సోషల్ మీడియాకు ఫోటోలు దిగడం అంటే.. కేవలం ప్రదర్శన కోసం కాదు, జ్ఞాపకాలను కాపాడుకోవడానికి అని తెలిసేలా చేస్తోంది. జియో కీప్యాడ్ ఫోన్ కలిగి ఉన్న ఒక జంట తాజ్ మహల్‌ను సందర్శనకు వచ్చారు. తమ దగ్గరున్న ఆ బుల్లి మొబైల్‌తోనే వారు తమ ఫోటోను నిస్సందేహంగా తీసుకుంటున్నారు. ఈ క్షణం ఎంతగా ప్రతిధ్వనించిందంటే, వీడియోను కేవలం ఒక రోజులోనే 20 మిలియన్లకు పైగా వీక్షించారు.
ఇంతకీ ఆ వైరల్ వీడియోలో ఏముందంటే..
@ya_muzzz అనే పేజీ ద్వారా Instagramలో షేర్ చేయబడిన ఒక వీడియోలో ఒక వ్యక్తి తాజ్ మహల్ కాంప్లెక్స్‌లోని ఒక వ్లాగర్‌ని సంప్రదించి, ఒక సాధారణ మొబైల్ ఫోన్ అతని చేతికి ఇచ్చాడు. తన ఫోన్ అతనికి ఇచ్చి.. మర్యాద పూర్వకంగా ఇలా అడుగుతాడు.. తన భార్యతో తనను తాజ్‌మహల్ కవర్ చేస్తూ ఫోటో తీయని కోరుతున్నాడు. తొందరేం లేదు..మీకు వీలైనతేనే తీయండి.. ఎందుకంటే.. ఈ క్షణం ఎప్పటికీ మేము భద్రంగా దాచుకోవాలన కోరిక మాత్రమే అని అడుగుతాడు. సదరు వ్లాగర్ వారి మొబైల్‌ఫోన్‌లోనే ఇద్దరినీ కలిపి బ్యాగ్రౌండ్‌లో తాజ్‌మహల్ కనిపించేలా ఫోటోలు తీశాడు. ఇదంతా వీడియో తీశారు అక్కడే ఉన్న మరికొందరు. అదే వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వీడియో పైన మెసేజ్ ఇలా ఉంది..ఇది ఫోటో నాణ్యత గురించి కాదు, జ్ఞాపకాలకు సంబంధించినది.. అని ఈ ఒక్క వాక్యం వేలాది మంది హృదయాలను తాకింది. వీడియో వైరల్ అయిన వెంటనే కామెంట్స్ బాక్స్ నిండా భావోద్వేగ కామెంట్స్‌తో నిండిపోయింది. ఆ రోజు అత్యంత అందమైన క్షణాన్ని తనలో బంధించిన ఆ ఫోన్‌ను చూసి స్మార్ట్‌ఫోన్‌లు కూడా అసూయపడి ఉండాలి అని ఒకరు స్పందించారు. చాలామంది దీనిని అమూల్యమైన క్షణంగా అభివర్ణించారు. వీడియో చూస్తున్నప్పుడు చాలా మంది తమ కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయని రాశారు.
వీడియో ఇక్కడ చూడండి..
View this post on Instagram
శాశ్వత ప్రేమకు చిహ్నంగా ఉన్న తాజ్ మహల్ నేపథ్యం ఈ వీడియోను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. ఇది కేవలం ఫోటో కాదు, అధిక రిజల్యూషన్ కెమెరా అవసరం లేని ప్రేమ కథకు సాక్షం అంటున్నారు చాలా మంది. ఫోటోలు ఎల్లప్పుడూ స్పష్టంగా, పరిపూర్ణంగా ఉండనవసరం లేదని ఈ వీడియో మరోసారి నాకు అర్థమయ్యేలా చేస్తుంది. కొన్నిసార్లు, అస్పష్టమైన ఫోటో కూడా జీవితంలోని స్పష్టమైన జ్ఞాపకంగా మారవచ్చు అంటూ మరికొందరు రాశారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




