ప్రతీ ప్రమోషన్ కూ రూ.25వేలు తీసుకుంటానని నీకెవడు చెప్పాడు? వీడియో
సుష్మా భూపతి.. సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. వృత్తిరీత్యా టీచర్ అయిన సుష్మా భూపతి సోషల్ మీడియాలో ఒకే ఒక్క డాన్స్ స్టెప్ తో పాపులర్ అయ్యింది. ఆ ఒక్క డాన్స్ స్టెప్ తర్వాత ఆమె లైఫ్ పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా వల్ల వచ్చిన క్రేజ్ తో పలు ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టింది. దాంతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈక్రమంలోనే ఆమె పై కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ కామెంట్స్ పై ఇప్పుడో ఇంటర్వ్యూలో ఆమె రియాక్టైంది.
ఓ ఇంటర్వ్యూలో తనపై వచ్చిన కొన్ని ఆరోపణలకు ధైర్యంగా సమాధానమిచ్చింది సుష్మా భూపతి. రూ. 25,000 రూపాయలు ముట్టజెబితే.. సుష్మ ఎలాంటి ప్రమోషన్ అయినా చేస్తుంది అనే ఆరోపణ ఉందని.. దానికిపై మీ కామెంట్ ఏంటంటూ రీసెంట్ ఇంటర్వ్యూలో హోస్ట్ అడగగా.. అందుకు క్లియర్ కట్గా ఆన్సర్ ఇచ్చింది సుష్మ.నువ్వు నాకు ఎంత ఇచ్చావు? అంటూ హోస్ట్ నే ప్రశ్నించి తాను మరీ అందరు అనుకునేంత మనీ మైండెడ్ కాదన్నట్టు హింట్ ఇచ్చింది. ఇక్కడ కూర్చోవడానికి మీరు ఏమివ్వలేదు కదా.. మరి రూ.25,000 తీసుకోకుండా నేను ఎందుకు ఇక్కడ కూర్చోవాలి.? నువ్వు అడిగిన దానికి ఎందుకు ఆన్సర్ ఇవ్వాలి.? అని సెటైరికల్‌గా హోస్ట్‌కే ప్రశ్నలు విసిరింది. అంతేకాదు ఒక యూట్యూబర్ వల్లే.. తనపై ఈ ఆరోపణ వచ్చిందని.. అది ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉందని సుష్మ చెప్పుకొచ్చింది. . ప్రమోషన్స్ చేసి.. బదులుగా డబ్బులు తీసుకుంటాను కానీ.. డిమాండ్ చేయనంటూ క్లారిటీ ఇచ్చింది.
పదేళ్లుగా ఆ రొట్టెలనే తింటున్నా రకుల్ డైట్ ఇదే వీడియో
క్యాబేజీ తిన్న యువతి మెదడులో పురుగులు వీడియో
కమ్మేస్తున్న పొగమంచు..గజగజా వణుకుతున్న జనం వీడియో
ఫ్రిజ్ ఖాళీ చేస్తున్న వ్యక్తి.. లోపలికి తొంగి చూసి షాక్ వీడియో
కొండగట్టు అంజన్నే నా ప్రాణాలు కాపాడారు వీడియో
ఉద్యోగులకు సర్కార్ గుడ్‌న్యూస్..భారీగా సెలవుల ప్రకటన వీడియో
రైతుల కోసం మరో కొత్త పథకం..డబ్బులు రిలీజ్.. జనవరి నుంచే అమలు
