Cinema: రిలీజైన 10 రోజుల్లోనే 100 కోట్లకు పైగా కలెక్షన్లు.. ‘ధురంధర్’ రికార్డు బ్రేక్.. ఇంతకి ఏముందీ సినిమాలో
క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రిలీజ్ అయిన 10 రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. పర్సంటేజ్ పరంగా చూసుకుంటే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ ధురంధర్ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది.

ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఈ హీరోకు తెలుగులోనూ చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే ఈ మలయాళం హీరో చాలా కాలంగా వరుస పరాజయాలు అందుకుంటున్నాడు. సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. అయితే ఇప్పుడు అతను నటించిన ఒక సినిమా బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడుతోంది. కనీవినీ ఎరుగని కలెక్షన్ల సాధిస్తూ ట్రేడ్ నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా రిలీజైన 10 రోజుల్లోనే రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. తొలి వారం కలెక్షన్ల పర్సంటేజీ పరంగా చూసుకుంటే ఈ సినిమా ధురంధర్ రికార్డును బ్రేక్ చేసింది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా జోరును చూస్తుంటే మలయాళంలో అత్యధిక కలెక్షన్లు సాధించే సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశముంది.
ప్రస్తుతం మలయాళంలో 2025లో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా కొత్త లోకా టాప్ ప్లేస్‌లో ఉంది.
ప్రస్తుతం మలయాళంలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయిన ఈ సినిమా పేరు సర్వం మాయ. అంటే తెలుగులో అంతా భ్రమే అని అర్థం. ఈ చిత్రంలో ప్రీతి ముఖంధన్, అజు వర్గీస్ కూడా నటించారు. నివిన్ పౌలీతో పాటు కొత్త హీరోయిన్ రియా షిబు ఈ సినిమాలో నటించింది. ప్రీతి ముఖంధన్, అజు వర్గీస్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.
ప్రేమమ్ హీరో గ్రేట్ కమ్ బ్యాక్..
BIGGEST EVER COMEBACK IN MOLLYWOOD 🏆🏆🏆🏆#SarvamMaya 100 Crores + Worldwide Gross Done & Dusted in 10 Days 🔥🔥 First #NivinPauly Movie to Gross 100 Cr 👏👏 Just a Feel Good Family Movie 💥 When He is in his safe zone then no one can even touch him once again Proved 🔥🔥🔥🔥 pic.twitter.com/1T0i530cs3
— Kerala Box Office (@KeralaBxOffce) January 3, 2026
సినిమా కథేంటంటే..
సర్వం మాయ సినిమా కథ విషయానికి వస్తే.. ఇదొక ఫాంటసీ హారర్ కామెడీ మూవీ. పాలక్కాడ్ లోని సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన నాస్తిక వాది అయిన ప్రభేందు నంబూతిరి కథ ఇది. సంగీతకారుడు కావాలని అతను కలలు కంటాడు.అయితే అతని జీవితంలోకి ఊహించని విధంగా ఒక ‘ఆత్మ’ ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ఆ పూజారి చేసే వింత పనులు, పడే ఇబ్బందులు ఏంటి అనేది ఈ సినిమా కథ.
100 CRORES CLUB :#SarvamMaya enters 100 Crores Club Worldwide in 10 days . Truly , A Dream Comeback For #NivinPauly 🔥 pic.twitter.com/BUsNtMwfJO
— Friday Matinee (@VRFridayMatinee) January 3, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




