ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్..’ఛావా’ హీరోతో ఉన్న ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ఛావా సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో ఫేమస్ అయ్యాడు బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్. ఇప్పుడు అతనికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక విక్కీ కౌశల్ భార్య కత్రినా కైఫ్ కూడా తెలుగు ఆడియెన్స్ కు పరిచయమే. అయితే ఒక టాలీవుడ్ హీరోయిన్ ఈ బాలీవుడ్ హీరోకు బెస్ట్ ఫ్రెండ్ అని మీకు తెలుసా?

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒక రకమైన ఫన్నీ ఎక్స్‌ప్రెషన్ తో పోజులిస్తోన్న వారిలో ఒకరినీ ఈజీగా గుర్తుపట్టవచ్చు. ఛావా సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిన వీక్కీ కౌశల్ టీనేజ్ ఫొటో అది. మరి అతనితో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె టాలీవుడ్ క్రేజీ హీరోయిన్. ఓ వైపు సీనియర్ హీరోలతో కలిసి నటిస్తూనే యంగ్ హీరోలతోనూ రొమాన్స్ చేస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఆమె క్రేజీ హీరోయిన్ గా వెలుగొందుతోంది. ఈ ఫొటో విషయానికి వస్తే.. సినిమా ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో వీరు కూడా ఒకరు. వీరిద్దరు ఛైల్డ్ హుడ్ ఫ్రెండ్స్. ముంబైలో పక్క పక్క ఇళ్లలోనే ఉండే వారు. ఇక వీరి పేరెంట్స్ కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులే కావడంతో ఒకరి ఫంక్షన్లకు మరొకరు వెళ్లేవారు. పండగలను కలిసి సెలబ్రేట్ చేసుకునే వాళ్లు. అయితే సినిమా ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత వీరు ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. కానీ ఎక్కువగా కలవకపోయినా ఒకరి సినిమాలకు మరొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకోవడం, పండగలు, ప్రత్యేక సందర్భాల్లో పరస్పరం విష్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు. గతంలో ఓనం పండగ సందర్భంగా ఈ హీరోయిన్ ఇంటికి వెళ్లాడు విక్కీ కౌశల్. అలాగే పలు సందర్భాల్లోనూ కలిసి కనిపించారు. మరి విక్కీతో ఉన్న అమ్మాయిని గుర్తు పట్టారా? ఆమె మరెవరో కాదు ది రాజాసాబ్ హీరోయిన్ మాళవిక మోహనన్.
;ప్రభాస్ హీరోగా నటించిన ది రాజాసాబ్ లో ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లతో పాటు మలయాళం బ్యూటీ మాళవికా మోహనన్ డార్లింగ్ తో రొమాన్స్ చేయనున్నారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 09న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మాళవిక మోహనన్ కు సంబంధించి చిన్ననాటి ఫొటోలు, వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
విక్కీ కౌశల్ తో మాళవిక..
View this post on Instagram
సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట సినిమాతో వెండి తెరకు హీరోయిన్గా పరిచయమైంది మాళవిక. ఆ తర్వాత విజయ్ దళపతి.. డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో వచ్చిన మాస్టర్ మూవీ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక తంగలాన్ సినిమాలో మాంత్రికురాలు ఆరతి పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం ది రాజాసాబ్ సినిమాతో మరో హిట్ అందుకునేందుకు రెడీ అవుతోంది.
ది రాజాసాబ్ ఈవెంట్ లో మాళవిక..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




