Meena : వాళ్లలాగా చెయ్యమని నన్ను బలవంతం చేసేవారు.. హీరోయిన్ మీనా..
హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాలనటిగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత హీరోయిన్ గా చక్రం తిప్పింది. దశాబ్దాలపాటు దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. అయితే నిత్యం ఆమె గురించి ఏదోక న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూ మీనా చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

సౌత్ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో మీనా ఒకరు. చైల్డ్ ఆర్టిస్టుగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత కథానాయికగా మెప్పించింది. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, బాలకృష్ణ, రజినీకాంత్ వంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. దశాబ్దాలపాటు ఇండస్ట్రీని శాసించింది. ఇప్పటికీ సహాయ నటిగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో మీనా మాట్లాడుతూ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలకు ప్రాధాన్యతనిచ్చి, అటువంటి పాత్రలు చేయలేదని బాధపడినట్లు తెలిపారు. అయితే పాత్రల ఎంపిక, నటనకు ప్రాధాన్యత ఇవ్వడం తన కెరీర్‌ను మరింత అందంగా మార్చిందని అన్నారు. అలాగే అందరూ హీరోయిన్ల మాదిరిగానే తనను కూడా గ్లామర్ రూల్స్ చేయాలని బలవంతం చేశారని చెప్పుకొచ్చింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
నటి మీనా మాట్లాడుతూ.. ఒకప్పుడు తాను కూడా గ్లామర్ పాత్రలు చేస్తే మరింత గుర్తింపు వస్తుందేమోనని భావించినట్లు తెలిపారు. ఒకప్పుడు గ్లామర్ పాత్రలు చేసే నటీమణులకు లభించే ప్రాధాన్యత, గుర్తింపు చూసి, తాను కూడా అలాంటి పాత్రలు చేయాలనుకున్నానని మీనా తెలిపారు. “నేను కూడా హీరోయిన్నే కదా, వాళ్లకంటే సీనియర్‌ని. నాకెందుకు ఈ గుర్తింపు దొరకడం లేదు?” అని భావించి, అప్పుడు తన తల్లి వద్ద బాధపడిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు. కేవలం గ్లామర్ మాత్రమే కాదని, తన పాత్రల ఎంపిక, వైవిధ్యభరితమైన క్యారెక్టర్లు తన కెరీర్‌ను నిలబెట్టాయని ఆమె అన్నారు. ముఖ్యంగా రోజాతో ఒకరికొకరం పోటీపడేవారమని, ఒకరు చేయని సినిమాను మరొకరు చేసేవారమని, “మీనా-రోజా, రోజా-మీనా” అన్నట్లు ఉండేదని ఆమె గుర్తుచేసుకున్నారు.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
గ్లామర్ పాత్రల ఒత్తిడి గురించి అడగగా, కెరీర్ ప్రారంభంలో పెద్దగా లేకపోయినా, తర్వాత “మీరు కూడా చేయాలి, చేస్తే తప్పు లేదు” అని చాలా మంది ప్రయత్నించారని మీనా అన్నారు. తాను కూడా ప్రయత్నించాలని అనుకొని, ప్రభుదేవా సినిమా కోసం ఒకసారి స్విమ్‌సూట్‌లో నటించానని తెలిపారు. అయితే, ఆ డ్రెస్ వేసుకున్న వెంటనే తాను చాలా అసౌకర్యంగా భావించానని, మేకప్ రూమ్ నుండి బయటకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డానని చెప్పారు. “ఈ హీరోయిన్స్ అందరూ ఎలా చేస్తున్నారురా బాబూ” అని నిజంగానే ఆశ్చర్యపోయానని అన్నారు. కమిట్‌మెంట్ ఇచ్చాను కాబట్టి చేశానని, అది తన కెరీర్‌లో ఒక్కసారి మాత్రమే జరిగిందని మీనా స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
