Carrot Soup: జలుబు నుంచి వెంటనే ఉపశమనం పొందాలంటే.. ఈ సూప్ ఓసారి ట్రై చేయండి
శీతాకాలం దాదాపు ప్రారంభమైనట్లే. గత కొన్ని రోజులుగా పగలంతా భానుడి భగభగలు.. రాత్రి అయితే తెల్లారేంత వరకూ చల్లని వాతావరణం నెలకొంటోంది. దీంతో చర్మం కూడా బిగుతుగా మారిపోవడం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తటం ప్రారంభమయ్యాయి. వాతారణ మార్పుల వల్ల సాధారణంగా ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాస్త నలతగా అనిపించగానే పారాసెటమాల్ వేసుకోవడం మనలో చాలా మందికి అలవాటు. అయితే ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది కానీ దగ్గు, గొంతు నొప్పిని..

శీతాకాలం దాదాపు ప్రారంభమైనట్లే. గత కొన్ని రోజులుగా పగలంతా భానుడి భగభగలు.. రాత్రి అయితే తెల్లారేంత వరకూ చల్లని వాతావరణం నెలకొంటోంది. దీంతో చర్మం కూడా బిగుతుగా మారిపోవడం, జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తటం ప్రారంభమయ్యాయి. వాతారణ మార్పుల వల్ల సాధారణంగా ఇటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. కాస్త నలతగా అనిపించగానే పారాసెటమాల్ వేసుకోవడం మనలో చాలా మందికి అలవాటు. అయితే ఇది జ్వరాన్ని తగ్గిస్తుంది కానీ దగ్గు, గొంతు నొప్పిని తగ్గించదు. దీని కోసం మీరు అదనంగా మరికొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జలుడు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు వేడి వేడిగా సూప్ తాగితే చాలా రిలీఫ్‌గా ఉంటుంది. ఈ రోజు అలాంటి ఓ ఆరోగ్యకరమైన సూప్ తయారీ చేసే విధానం తెలుసుకుందాం. అందుకు కొన్ని క్యారెట్లు, కొత్తిమీర తరుగు, చికెన్ ఉంటే చాలు. ఈ సూప్‌ను సులువుగా తయారు చేసుకోవచ్చు..
క్యారెట్ – కొత్తిమీర సూప్ కోసం కావలసిన పదార్ధాలు..
400 గ్రాముల క్యారెట్లు, 2 వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క, 1/2 లీటర్ చికెన్ స్టాక్, కొన్ని కొత్తిమీర ఆకులు, 1 తరిగిన ఉల్లిపాయ, 1 స్పూన్ కూరగాయల నూనె, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు మిరియాల పొడి.
క్యారెట్ – కొత్తిమీర సూప్ ఎలా తయారు చేయాలంటే..
ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులోనే ఉల్లిపాయ, వెల్లుల్లి వేసి వేయించాలి. ఉల్లిపాయ వేగాక అందులో అల్లం వేయాలి. దానికి తరిగిన కొత్తిమీర తరుగు కలపాలి. మిశ్రమాన్ని 1 నిమిషం పాటు బాగా వేయించాలి. తర్వాత క్యారెట్ ముక్కలే వేసి బాగా కలపాలి. చివరగా, చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత క్యారెట్ ముక్కలను బాగా మరిగించాలి. మంట తగ్గించి ఇరవై నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. క్యారెట్లు ఉడికించడానికి చాలా సమయం పడుతుంది. క్యారెట్లు ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలి. హ్యాండ్ బ్లెండర్ సహాయంతో ఈ మిశ్రమాన్ని మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. హ్యాండ్ బ్లెండర్ లేకపోతే మిక్సీలో పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. సూప్ చిక్కగా, మృదువుగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు చివరిగా ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లితే క్యారెట్ – కొత్తిమీర సూప్ రెడీ అయిపోయినట్లే.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.








