Fish Oil Benefits: చర్మం పొడిబారి అసౌకర్యంగా అనిపిస్తుందా? ఈ నూనె అప్లై చేశారంటే మీ కళ్లను మీరే నమ్మలేరు..
శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చర్మం పొడిబారుతుంటుంది. ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రం నుంచి చలిగాలులు వీయడం వల్ల స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారినట్లు గరుకుగా మారుతుంది. లోషన్ రాసుకోకపోతే చర్మం బిగుతుగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది. చలికాలం రాబోతోందనడానికి సంకేతం చర్మం పొడిబారడం. కానీ చలికాలం వచ్చిందంటే చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఎన్నో పద్ధతులు పాటించవల్సి ఉంటుంది. నిజానికి చల్లగా ఉన్నప్పుడు చర్మంలోని తేమ త్వరగా పోతుంది. సాధారణంగా చాలా మంది ఈ సీజన్‌లో మాయిశ్చరైజర్ రాసుకోవడం ద్వారా తమ చర్మాన్ని..

శీతాకాలంలో చర్మ సంరక్షణకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న చర్మం పొడిబారుతుంటుంది. ఉదయం ఎండగా ఉన్నా సాయంత్రం నుంచి చలిగాలులు వీయడం వల్ల స్నానం చేసిన తర్వాత చర్మం పొడిబారినట్లు గరుకుగా మారుతుంది. లోషన్ రాసుకోకపోతే చర్మం బిగుతుగా మారి అసౌకర్యంగా అనిపిస్తుంది. చలికాలం రాబోతోందనడానికి సంకేతం చర్మం పొడిబారడం. కానీ చలికాలం వచ్చిందంటే చర్మాన్ని సంరక్షించుకోవడానికి ఎన్నో పద్ధతులు పాటించవల్సి ఉంటుంది. నిజానికి చల్లగా ఉన్నప్పుడు చర్మంలోని తేమ త్వరగా పోతుంది. సాధారణంగా చాలా మంది ఈ సీజన్‌లో మాయిశ్చరైజర్ రాసుకోవడం ద్వారా తమ చర్మాన్ని సంరక్షించుకుంటారు. కానీ బదులుగా చేప నూనెను ఉపయోగిస్తే రెట్టింపు ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు ఆరోగ్యనిపుణులు. అవేంటో తెలుసుకుందాం..
చాలా మంది వంటల్లో చేప నూనె వినియోగిస్తుంటారు. కొందరు చేప నూనెను సప్లిమెంట్‌గా కూడా ఉపయోగిస్తారు. ఎందుకంటే చేప నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిలోని పోషకాలు శరీరానికి చాలా అవసరం. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడుతుంది. అదేవిధంగా, అన్ని చర్మ సమస్యలను నయం చేస్తుంది. చేపల నూనె చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా ఎలాంటి నష్టం జరగకుండా కాపాడుతుంది. చర్మంపై ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే చేప నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కద పరిశీలిద్దాం.
చర్మం మంటను తగ్గిస్తుంది
ఫిష్ ఆయిల్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇది శరీరంతో పాటు చర్మంలో మంటను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువ కాలంగా తామర, సోరియాసిస్ లేదా మొటిమలతో బాధపడేవారికి చేప నూనె మంచి ఎంపిక. చేప నూనె ఆహారంలో తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థలో మంట తగ్గుతుంది. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది చర్మం అందాన్ని అభివృద్ధి చేయడంలో కూడా సహాయపడుతుంది.
చర్మాన్ని తేమగా ఉంచుతుంది
చేప నూనెలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఉంటాయి. ఇవి చర్మంపై రక్షిత పొరను ఏర్పరుస్తాయి. ఇది చర్మం నుంచి నీటి స్రావాన్ని నిలిపివేస్తుంది. అలాగే చర్మం పొడిబారకుండా చేసి, చర్మం తేమను కాపాడడంలో సహాయపడుతుంది.
సూర్యకాంతి నుంచి చర్మాన్ని రక్షిస్తుంది
సూర్యుని నుంచి వచ్చే హానికరమైన కిరణాలు మన చర్మానికి అత్యంత హానికరం. అందుకే ఎల్లప్పుడూ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించమని సౌందర్య నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. సన్‌స్క్రీన్‌తో పాటు చేప నూనెను ఉపయోగించడం వల్ల చర్మాన్ని పొడిబారకుండా కాపాడుకోవచ్చు. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారంలో చేప నూనెను చేర్చుకుంటే ప్రతిరోజూ సన్‌స్క్రీన్‌ను అప్లై చేసినట్లే అవుతుంది.
చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది
చేప నూనె చర్మంలో కొల్లాజెన్ ఏర్పడటానికి సహాయపడుతుంది. ఇది చర్మంపై వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. చేప నూనెను ఉపయోగించడం వల్ల, ముడతలు, ఫైన్ లైన్స్, మచ్చలు వంటివి మటుమాయం అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.