Cycling Health Benefits: రోజుకు 30 నిమిషాలు సరదాగా సైకిల్ తొక్కితే చాలు.. బెనిఫిట్స్ అస్సలు ఊహించలేరు..!
బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామంగా ఉంటుంది. సైక్లింగ్‍తో క్యాలరీ ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది. మంచి కార్డియో వ్యాయామంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. మానసిక సమస్యలతో బాధపడే వారు సైక్లింగ్ చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది.

ప్రతిరోజూ సైక్లింగ్ చేస్తే అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఒక అద్భుతమైన శారీరకవ్యాయామమని నిపుణులు చెబుతున్నారు. సైకిల్ తొక్కడంతో శరీరానికి మంచి వ్యాయామం అవుతుంది. పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. సైక్లింగ్ చేయటం వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి, ఏకాగ్రత పెరుగుతుంది. సైక్లింగ్ చేయటం వల్ల డయాబెటిస్, రక్తపోటు వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు.. సైక్లింగ్ వల్ల మానసికంగానూ లాభాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సైక్లింగ్ తో ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. కండరాలు దృఢంగా తయారవుతాయి. మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతి రోజూ సైకిల్ తొక్కడం వల్ల కీళ్ల కదలికల్లో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. కీళ్ల సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. సైకిల్ తొక్కడం వల్ల శరీర భాగాలకు రక్తప్రసరణ బాగా జరుగుతుంది. అలాగే రక్తంలో ఉండే కొవ్వు శాతాన్ని తగ్గించేందుకు కూడా ఇది సహకరిస్తుంది.
చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు శరీరంలో వివిధ సమస్యలు తలెత్తడం ప్రారంభిస్తాయి. కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. సైక్లింగ్ వల్ల శరీరంలో ఫీల్ గుడ్ హార్మోన్స్ ఎండార్ఫిన్స్ విడుదల ఎక్కువ అవుతుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఆందోళన, డిప్రెషన్ కూడా తగ్గుతాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. మానసిక సమస్యలతో బాధపడే వారు సైక్లింగ్ చేస్తే ఉపశమనంగా అనిపిస్తుంది.
సైక్లింగ్ వల్ల శరీరానికి బోలెడు లాభాలు ఉంటాయి. రెగ్యులర్ సైక్లింగ్ చేస్తే కండరాలు పెరిగేందుకు తోడ్పడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా సైక్లింగ్ చేయడం మంచి వ్యాయామంగా ఉంటుంది. సైక్లింగ్‍తో క్యాలరీ ఎక్కువగా బర్న్ అవుతాయి. దీంతో వెయిట్ లాస్‍కు ఉపకరిస్తుంది. మంచి కార్డియో వ్యాయామంగా ఉంటుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. బ్లడ్ ప్రెజర్ కూడా తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








