Blue Tea: వామ్మో..ఈ టీ వారానికి రెండు కప్పులు తాగితే చాలట.. అమృతంలాంటి ప్రయోజనాలు..!
ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలో కూడా అంతే ప్రత్యేక ప్రాధన్యత కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాలకు ఔషధంగా శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. వారంలో రెండు సార్లు శంఖుపుష్పాల టీని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

శంఖుపుష్పం..ఈ పువ్వును ప్రధానంగా దేవతార్చనలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. శంఖుపుష్పాన్ని అపరాజితా పుష్పం, గిరికర్ణిక, దింటెన అనే పేర్లతో పిలుస్తుంటారు. ఈ పుష్పాన్ని పూజలో ఎంత ప్రవిత్రంగా భావిస్తారో ఆయుర్వేదంలో కూడా అంతే ప్రత్యేక ప్రాధన్యత కలిగి ఉందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆయుర్వేద వైద్యంలో ఎన్నో అనారోగ్యాలకు ఔషధంగా శంఖుపుష్పాన్ని వాడుతూ ఉంటారు. వారంలో రెండు సార్లు శంఖుపుష్పాల టీని తీసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
శంఖుపుష్పాలతో చక్కటి టీ తయారు చేసుకోవచ్చు.. దీనిని ప్రస్తుతం బ్లూ టీగా పిలుస్తున్నారు. ఇది నీలం రంగులో ప్రత్యేకంగా ఉంటుంది. ఈ టీ శక్తివంతమైన ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక కప్పు బ్లా టీ తాగటం వల్ల జీర్ణక్రియలో పేరుకున్న టాక్సిన్స్ తొలగిపోతాయని, జీర్ణక్రియ ఆరోగ్యానికి ఎంతో చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయని చెబుతున్నారు.
బరువు తగ్గే ప్రయత్నంలో ఉన్నవారు ఈ బ్లూ టీ తాగటం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. శంఖుపువ్వుల టీలో కెఫిన్ ఉండదు. అలాగే కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, కొలెస్ట్రాల్ ఉండవు. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. చిరుతిండ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఫలితంగా బరువు తగ్గేందుకు దోహదం చేస్తుంది. అంతేకాదు.. రోజూ శుంఖు పుష్పాల టీ తాగితే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఆకస్మికంగా పెరగకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ బ్లూ టీలో ఫినోలిక్ యాసిడ్, ఫినాలిక్ అమైడ్ యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీహైపెర్గ్లైసీమిక్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్రావాన్ని మెరుగుపరుస్తాయి. గ్లూకోజ్ జీవక్రియను నియంత్రిస్తాయి. షుగర్ పేషెంట్స్‌కి మంచిది. శంఖు పుష్పాల టీలో బలవర్ధకమైన బయోఫ్లావనాయిడ్ సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. యాంటీహైపెర్లిపిడెమిక్ లక్షణాలు కొలెస్ట్రాల్ వాల్యూమ్‌లను, కొవ్వును తగ్గిస్తాయి. హైపర్‌టెన్షన్ వంటి తీవ్ర అనారోగ్యాల నుంచి రక్షిస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని మెరుగు చేస్తుంది. అల్జీమర్స్‌తో పోరాడటానికి కూడా సహాయపడుతుంది.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..








