AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?

గుడ్లు పోషకాలతో నిండిన ఒక అద్భుతమైన ఆహారం. ఇవి కంటి ఆరోగ్యానికి, మెదడు పనితీరుకు మేలు చేస్తాయి. గుడ్లు తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అయితే బరువు తగ్గాలకునేవారికి ఉడకబెట్టిన గుడ్లు మంచివా..? ఫ్రైడ్ ఎగ్స్ మంచివా అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Eggs: ఉడికించిన గుడ్లు Vs ఫ్రైడ్ ఎగ్స్.. బరువు తగ్గడానికి ఏది బెస్ట్..?
Boiled Eggs Vs Fried Eggs
Krishna S
|

Updated on: Sep 21, 2025 | 7:51 AM

Share

గుడ్లు కేవలం రుచికరమైనవే కాదు. అవి ప్రోటీన్, విటమిన్లు, మినరల్స్‌తో నిండి ఉంటాయి. మీరు బరువు తగ్గాలనుకునే వారికి గుడ్లు బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తాయి. అవి మనకు కావలసిన పోషకాలను ఇస్తాయి. అయితే గుడ్లను ఉడకబెట్టి తినాలా లేక ఫ్రై చేసి తినాలా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనిపై పోషకాహార నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

గుడ్లు ఎందుకు మంచివంటే..?

గుడ్లలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తిన్న తర్వాత మన కడుపు ఎక్కువసేపు నిండినట్లు అనిపిస్తుంది. దీనివల్ల మనకు ఆకలి త్వరగా వేయదు. దీంతో మనం తక్కువ ఆహారం తీసుకుంటాం. అందుకే బరువు తగ్గడానికి గుడ్లు చాలా ఉపయోగపడతాయి.

ఉడికించిన గుడ్లు వర్సెస్ ఫ్రైడ్ ఎగ్స్

కేలరీలు – కొవ్వు:

ఉడికించిన గుడ్లు: ఒక ఉడికించిన గుడ్డులో సుమారు 70-80 కేలరీలు ఉంటాయి. వీటిని ఉడకబెట్టేటప్పుడు ఎలాంటి అదనపు నూనె లేదా వెన్న అవసరం లేదు కాబట్టి కేలరీలు తక్కువగా ఉంటాయి.

వేయించిన గుడ్లు: ఫ్రై చేయడానికి నూనె లేదా వెన్న వాడతారు కాబట్టి కేలరీల సంఖ్య పెరుగుతుంది. దీనివల్ల వేయించిన గుడ్లలో సాధారణంగా ఉడికించిన గుడ్డు కంటే ఎక్కువ కేలరీలు, కొవ్వు ఉంటాయి.

మీరు తక్కువ కేలరీలను కోరుకుంటే ఉడికించిన గుడ్లు లేదా ఉత్తమం.

ప్రోటీన్ – సంతృప్తి:

ఉడికించినా, వేయించినా గుడ్లలో ఉండే ప్రోటీన్ మారదు. ఈ ప్రోటీన్ మన కడుపు నిండినట్లు ఉంచడంలో సహాయపడుతుంది. కాబట్టి ఈ విషయంలో రెండూ సమానమే.

వంట చేసే విధానం వల్ల పోషకాల నష్టం

సాధారణంగా గుడ్లను ఉడకబెట్టడం, ఫ్రై చేయడం వంటి పద్ధతులు వాటిలోని పోషకాలను పెద్దగా ప్రభావితం చేయవు. అయితే ఎక్కువసేపు అధిక వేడిలో ఉడికించినప్పుడు కొన్ని సూక్ష్మపోషకాలు తగ్గుతాయి. అలాగే అధిక ఉష్ణోగ్రత వద్ద ఫ్రై చేయడం వల్ల కొలెస్ట్రాల్ ఆక్సీకరణం పెరిగే అవకాశం ఉందని కొన్ని పరిశోధనలు సూచిస్తున్నాయి. అందుకే మితమైన వేడిలో తక్కువ సమయం పాటు ఉడికించడం ఉత్తమం.

నూనె – కొవ్వు ఎంపిక:

మీరు గుడ్లు ఫ్రై ఆలివ్ ఆయిల్ వంటి ఆరోగ్యకరమైన నూనెను ఒక టీస్పూన్ వాడితే, అదనపు కేలరీలు తక్కువగా ఉంటాయి.

కానీ ఎక్కువ వెన్న లేదా నూనెలో గుడ్లను వేయించడం, లేదా జంక్ ఫుడ్‌తో కలిపి తినడం వల్ల కేలరీలు భారీగా పెరుగుతాయి. ఇది బరువు తగ్గడానికి ప్రతికూలంగా మారుతుంది.

ఏది ఎంచుకోవాలి?

మీరు చాలా తక్కువ కేలరీలు కావాలనుకుంటే, ఉడికించిన గుడ్లను ఎంచుకోండి. ఒకవేళ మీకు వేయించిన గుడ్ల రుచి నచ్చితే, కొద్దిగా మంచి నూనె (ఆలివ్ ఆయిల్ లాంటిది) వాడి వేయించుకోవచ్చు.

బరువు తగ్గాలంటే రోజు మొత్తం తీసుకునే కేలరీల సంఖ్య, సమతుల్య ఆహారం ముఖ్యం. గుడ్లు దానికి ఒక మంచి సాధనం మాత్రమే. మీకు ఏ విధంగా గుడ్లు తినడం ఇష్టమో, ఆ విధంగా వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

గుడ్లను కూరగాయలు, తృణధాన్యాలతో కలిపి తినడం వల్ల శరీరానికి మరిన్ని పోషకాలు అందుతాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులకు రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు సరిపోతాయి. బరువు తగ్గాలంటే రోజు మొత్తం తీసుకునే కేలరీల సంఖ్య, సమతుల్య ఆహారం ముఖ్యం. గుడ్లు దానికి ఒక మంచి సాధనం మాత్రమే. మీకు ఏ విధంగా గుడ్లు తినడం ఇష్టమో, ఆ విధంగా వాటిని మీ ఆహారంలో చేర్చుకోండి.

NOTE: పైన పేర్కొన్న అంశాలు వైద్య నిపుణులు, ఇంటర్నెట్‌ నుంచి సేకరించిన వివరాల ఆధారంగా అందించబడినవి.. వీటిపై మీరు ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
యూత్‌ బీ కేర్‌ఫుల్‌.. రాత్రి గుంపులుగా బయటతిరిగితే.. ఇక అంతే
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
వాస్తు ప్రకారం.. ఈ 5 పనులు చేసారంటే.. మీ శాలరీ హైక్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ఊరిని ఎవరు ఉద్దరిస్తారు.. సర్పంచ్ బరిలో ఎంబీబీఎస్ స్టూడెంట్..
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ప్రపంచంలోనే అతిపెద్ద షూ.. ధర తెలిస్తే గుండెల్లో దడదడే..!
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..