AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అర్ధరాత్రి వరకు మొబైల్‌ స్క్రీన్‌ చూస్తున్నారా.. అయితే ఆ కోరికలు పెరుగుతున్నాయట..!

Mobile Screen: వినడానికి కాస్త వింతగా అనిపించినా మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్, అలాగే ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల కాంతి వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయని తేలింది.

అర్ధరాత్రి వరకు మొబైల్‌ స్క్రీన్‌ చూస్తున్నారా.. అయితే ఆ కోరికలు పెరుగుతున్నాయట..!
Mobile Screen
uppula Raju
| Edited By: Anil kumar poka|

Updated on: Nov 29, 2021 | 7:23 PM

Share

Mobile Screen: వినడానికి కాస్త వింతగా అనిపించినా మొబైల్ నుంచి వెలువడే బ్లూ లైట్, అలాగే ల్యాప్‌టాప్, ఎల్‌ఈడీ స్క్రీన్‌ల కాంతి వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరుగుతున్నాయని తేలింది. అంతేకాదు రాత్రిపూట తీపి ఆహారం తినాలనే కోరిక ఎక్కువవుతుందట. స్ట్రాస్‌బర్గ్ విశ్వవిద్యాలయం, ఆమ్‌స్టర్‌డామ్ విశ్వవిద్యాలయ వైద్యులు ఎలుకలపై చేసిన పరిశోధనలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎలుకలను రాత్రిపూట కృత్రిమ కాంతిలో ఉంచినప్పుడు వాటి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయి, పెరిగినట్లు కనుగొన్నారు. అలాగే చాలా సేపు ఈ లైట్‌కి ఎక్స్‌పోజ్ అయిన తర్వాత బరువు కూడా పెరిగాయి.

ఎలుకల శరీరంలో 80 శాతం హార్మోన్లు, శారీరక విధులు దాదాపుగా మానవులతో సమానంగా ఉంటాయి. కాబట్టి శాస్త్రవేత్తలు మానవులపై పరిశోధనకు ముందు ఎలుకలపై ప్రయోగాలు చేస్తున్నారు. అందుకే వీటిపై చేసిన దాదాపు 100% ప్రయోగాలు మానవులపై నిజమని తేలాయి. అనేక ఔషధాల ప్రయోగాలు కూడా శాస్త్రవేత్తలు మొదట ఎలుకలపై పరిశోధించగా అవి విజయం సాధించిన తర్వాత మనుషులపై ప్రయోగిస్తారు. రాత్రిపూట కృత్రిమ బ్లూ లైట్‌కు ఎక్కువగా అడిక్ట్ కావడం వల్ల రక్తంలో షుగర్‌ లెవల్స్‌ పెరిగి, తీపి తినాలనే కోరికలు పెరుగుతున్నాయని కనుగొన్నారు. అంతేకాదు దీని వల్ల ఊబకాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు.

రాత్రిపూట ఎక్కువగా స్వీట్‌ ఆహారాలు తింటున్నారంటే మీరు టీవీ చూస్తూ లేదా మొబైల్ స్క్రీన్ ముందు ఎక్కువ సమయం గడిపడం వల్ల చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కృత్రిమ నీలం. మీరు మీ స్క్రీన్ సమయాన్ని తగ్గించుకోవాలి. మీ పనికి ల్యాప్‌టాప్ లేదా మొబైల్ చూడటం తప్పనిసరి అయితే బ్లూ లైట్ రేడియేషన్‌ను నివారించడానికి ఖచ్చితంగా యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగించండి. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన ఒక అధ్యయనం ప్రకారం.. యాంటీ గ్లేర్ గ్లాసెస్ ఉపయోగిస్తే నీలి కాంతి నేరుగా మన కళ్లపై ప్రభావం చూపదు.

LPG Subsidy: గ్యాస్‌ వినియోగదారులకు శుభవార్త.. డిసెంబర్‌ నుంచి ఎల్‌పీజీ సబ్సిడీ..! ఎవరికి లభిస్తుందంటే..?

UPSC Recruitment 2021: యూపీఎస్సీలో ఫ్యాకల్టీ, ట్యూటర్‌ పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

1985లో ముద్రించిన ఈ రూపాయికి 2.5 లక్షలు.. కానీ దానిపై ఈ గుర్తు ఉండాలి..