Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..

కరోనా ప్రభావంతో మూతపడిన స్కూల్స్, కాలేజీలు ఇటీవలే తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు చదువుపై దృష్టి పెడుతున్నారు.

Best Food : తల్లిదండ్రులకు సూచన.. ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు పెట్టాల్సిన బెస్ట్ ఫుడ్ ఎంటో తెలుసా..
Follow us

|

Updated on: Feb 27, 2021 | 7:19 AM

Best Food For Children’s: కరోనా ప్రభావంతో మూతపడిన స్కూల్స్, కాలేజీలు ఇటీవలే తిరిగి తెరుచుకుంటున్నాయి. దీంతో తల్లిదండ్రులు, పిల్లలు చదువుపై దృష్టి పెడుతున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఇక ఇదే సమయంలో పిల్లలు చురుగ్గా ఉండడం ముఖ్యం. ప్రశాంతంగా చదివి పరీక్షలు రాయలంటే.. వారికి ఆరోగ్యమైన ఫుడ్ అందుబాటులో ఉండాలి. అప్పుడే వారు పరీక్షలు బాగా రాయగల్గుతారు. ఎగ్జాం ప్రిపరేషన్ అంటే ఎక్కువ సేపు కూర్చుని ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోవడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో పిల్లలు ఇండోర్ గేమ్స్ కు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వారు శరీరానికి శ్రమ కల్పించే ఆటలను అంతగా ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది పిల్లలు వెయిట్ గెయిన్ అయ్యే అవకాశమే కాకా కాన్స్టిపెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కోవడానికి పిల్లలకు సరైన ఆహారం అందించాలి. ఇక ఎగ్జామ్స్ సమయంలో పిల్లలకు అందించాల్సిన బెస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.

☞ మీ పిల్లలకు రోజూ అందించే ఆహారంలో పప్పులు, పాలు, చీజ్, పన్నీర్, పెరుగు, ఎగ్స్, ఫ్యాటీ ఫిష్ వంటి ప్రొటీన్స్ పుష్కలంగా ఉండే పదార్థాలను జతచేయండి. ఇవి పిల్లల గ్రోత్‏కి చాలా అవసరం అలాగే ఇవి కూడా నెమ్మదిగా అరుగుతాయి.

☞ పండ్లూ కూరగాయలను ఎక్కువగా తినిపించండి. వీటిలో మినరల్స్, విటమిన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఎన్ని రంగుల్లో ఈ పండ్లూ కూరగాయలూ ఉంటే అంత మంచిది. సాధారణంగా పరీక్షల సమయంలో పిల్లలు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. అందుకే ఈ సమయంలో విటమిన్స్ సీ, బీ కాంప్లెక్స్, ఇంకా జింక్ ఉండే పదార్థాలను అందించాలి. ఒత్తిడి వల్ల ఫ్రీ రాడికల్ డ్యామేజ్ జరగకుండా వారికి యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి. అవి విటమిన్స్, ఏ, సీ, ఈ లో లభిస్తాయి.

☞ ఫ్రైడ్ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్ సాధ్యమైనంత వరకు మీ పిల్లలను దూరం ఉంచండి. వీటి వల్ల బద్ధకం పెరుగుతుంది, వెయిట్ గెయిన్ కూడా జరుగుతుంది.

☞ విటమిన్స్, ఫైబర్ నిండి ఉన్న హోల్ గ్రెయిన్స్ వంటి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇవ్వాలి. వారికి చపాతీ, అన్నం, కిచిడీ, ఇడ్లీ, దోసె, పోహా వంటివి పెట్టడం మంచిది. మైదా, పంచదార ఉండే ఫుడ్స్ పెట్టకండి. వీటి వల్ల త్వరగా ఆకలి వేస్తుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ నెమ్మదిగా అరుగుతాయి, ఎనర్జీ కూడా ఎక్కువ సేపు ఉంటుంది. ఫలితంగా పిల్లలు అలెర్ట్ గా ఉంటారు, బద్ధకం రాదు.

☞ శరీరానికి నీటి శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం నీరు ఎక్కువగా తాగేలా చూసుకొండి. రోజుకి కనీసం ఏడెనిమిది గ్లాసుల నీరు పిల్లలు తాగేలా చూసుకోవాలి. పిల్లలు అన్ని నీళ్ళు తాగడానికి పేచీ పెడితే ఈ ఏడెనిమిది గ్లాసుల ఫ్లూయిడ్ రిక్వర్మెంట్ ని కొబ్బరి నీరు, తాజా నిమ్మ రసం, మజ్జిగ, పాలు, సూప్స్, హెర్బల్ టీలి ద్వారా ఫుల్‌ఫిల్ చేయవచ్చు. వీలున్నంత వరకూ పళ్ళ రసాలు ఎవాయిడ్ చేయండి. పండు తినడం వల్ల ఫైబర్ తో పాటూ ఇంకా న్యూట్రియెంట్స్ లభిస్తాయి. పిల్లలు హైడ్రేటెడ్ గా ఉండడం వల్ల అలెర్ట్‏గా ఉంటారు, తల నొప్పి రాకుండా ఉంటుంది, బవెల్ మూమెంట్స్ ఇంప్రూవ్ అవుతాయి.

☞ ముఖ్యంగా కెఫీన్ తగ్గించాలి. రాత్రి ఎక్కువ సేపు మేలుకుని చదవడం కోసం విధ్యార్ధులు కాఫీ, టీ తాగుతూ ఉంటారు. సాయంత్రాలు టీ ఎక్కువగా తీసుకోవడం వలన నిద్ర సరిగ్గా పట్టదు. కాఫీ స్మాల్ క్వాంటీటీలో తీసుకుంటే అలెర్ట్నెస్ పెరుగుతుంది, కానీ ఎక్కువైతే మాత్రం యాంగ్జైటీ, నెర్వస్‌నెస్, ఇరిటబిలిటీ, తల నొప్పి వంటివి వస్తాయి.

☞ మీ పిల్లలకు రోజుకి మూడు సార్లు – బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ – మోడల్ కంటే పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న విద్యార్ధులకి నాలుగైదు సార్లు కొంచెం కొంచెంగా పెట్టడం మంచిది. వారికి నచ్చే జంక్ ఫుడ్ యొక్క ఆల్టర్నేటివ్స్ ని ఇంట్లోనే తయారు చేసి వారికి పెట్టండి.

☞ ఎగ్జామ్స్ అయ్యే వరకూ బయటి ఫుడ్ తినకుండా చూసుకోండి. ఎందుకంటే ఆ ఫుడ్ వలన కొన్నిసార్లు ఏమైనా ఇన్‌ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది.

☞ ఈ సమయంలో కొత్త రకాల ఆహార పదార్థాలను అందించకూడదు. ఒకవేళ అవి వారికి పడకపోతే ఎలర్జీ వచ్చే రిస్క్ ఉంటుంది. పరీక్షల సమయంలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. .

☞ మీల్స్ మధ్యలో నట్స్, సీడ్స్, పండ్లు, సలాడ్స్, సూప్, యోగర్ట్, స్మూతీలు, మజ్జిగ, ఎగ్స్, ఇడ్లీ, ఢోక్లా, పాలు వంటివి ఇవ్వవచ్చు.

☞ బ్రేక్ ఫాస్ట్ చాలా సేపు పొట్ట ఖాళీగా ఉన్న తరువాత తింటారు కాబట్టి దాన్ని కచ్చితంగా చేయండి. ఇందువల్ల వారి మెటబాలిజం కిక్ స్టార్ట్ అవుతుంది.

☞ ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, పంప్‌కిన్ సీడ్స్ వంటివి అలాగే తినేయవచ్చు, లేదా పొడి కొట్టి సలాడ్స్, శాండ్విచెస్. సూప్స్, స్మూతీల్లో కలిపి ఇవ్వవచ్చు.

☞ ఎగ్జామ్స్ సమయంలో మీ పిల్లలకు వేయించిన వేరుశనగ పప్పు, నట్స్, ఖాక్రా వంటివి లేట్ నైట్ తినడానికి వీలుగా ఉంచండి. బిస్కెట్లు, కుకీలు, కేక్స్, ఉప్పు ఎక్కువగా ఉండే నమ్కీన్స్ వంటివి ఎవాయిడ్ చేయండి. అలాగే మైదా, పంచదార, ప్రిజర్వేటివ్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఉన్న ఫుడ్స్ కూడా ఎవాయిడ్ చేయండి.

☞ ఎగ్జామ్ సమయంలో ఎక్కువగా ఒకేచోట కూర్చోని చదువుతూ ఉంటారు. అలాకాకుండా మీ పిల్లలు కూడా కొన్ని నిమిషాల ఫిజికల్ యాక్టివిటీ అయినా చేయాలి. ప్రతి గంటకీ ఒక సారి లేచి స్ట్రెచ్ చేయడం, కాసేపు వాకింగ్ చేయటం వంటి వాటి వల్ల యాక్టివ్‏గా ఉంటారు. ఐదు పది నిమిషాలు మెడ, కళ్ళ ఎక్సర్సైజులు చేయటం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

☞ పిల్లలకి పోషకాహారం తినిపించాలి. సరైన సమయానికి పడుకునేలా చూడండి. మీ పిల్లల ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధవహించి.. అవసరైన ప్రోటిన్ ఫుడ్ అందించడం ఉత్తమం.

Also Read:

మార్నింగ్ బ్రేక్‏ఫాస్ట్‏గా అటుకుల పులిహోర (పోహా).. కేవలం10 నిమిషాల్లోనే.. తింటే మైమరచిపోవాల్సిందే..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో