AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్నింగ్ బ్రేక్‏ఫాస్ట్‏గా అటుకుల పులిహోర (పోహా).. కేవలం10 నిమిషాల్లోనే.. తింటే మైమరచిపోవాల్సిందే..

అటుకులతో పులిహోర చేయడాన్నే పోహా అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి అతి కొద్ది మందికే తెలుసు. మహారాష్ట్రలో ఎక్కువగా పోహాను చేసుకుంటుంటారు.

మార్నింగ్ బ్రేక్‏ఫాస్ట్‏గా అటుకుల పులిహోర (పోహా)..  కేవలం10 నిమిషాల్లోనే.. తింటే మైమరచిపోవాల్సిందే..
Rajitha Chanti
|

Updated on: Feb 26, 2021 | 2:34 PM

Share

అటుకులతో పులిహోర చేయడాన్నే పోహా అంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో దీని గురించి అతి కొద్ది మందికే తెలుసు. మహారాష్ట్రలో ఎక్కువగా పోహాను చేసుకుంటుంటారు. అచ్చు పులిహోర తరహాలోనే ఉంటుంది. కానీ కాస్త రుచి భిన్నంగా ఉంటుంది. అంతేకాదు.. దీనివలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయితే దీనిని ఉదయం అల్పహారంగా తీసుకుంటుంటారు. దీనిని అటుకుల ఉప్మా అని కూడా అంటారు. అయితే అతి తక్కువ సమయంలోనే ఈ పోహాను రెడీ చేసుకోవచ్చు. అదేలానో తెలుసుకుందామా..

ప్రస్తుత హడవిడి పరుగుల జీవితంలో ఇంట్లో వంటచేసుకునే సమయం లేక..చాలా మంది బయటి ఫుడ్‏కు ప్రాముఖ్యం ఇస్తున్నారు. అలాంటి వారికి పోహా బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. తక్కువ సమయంలోనే ఎంతో రుచికరమైన పోహాను రెడీ చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే అటుకులు, నిమ్మకాయ, పోపులు, పల్లీలతో కేవలం 10 నిమిషాల్లోనే పోహా తయారుచేసుకోవచ్చు. తయారీ విధానం తెలుసుకుందాం.

దీనికి కావాల్సిన పదార్థాలు…

అటుకులు- ఒక కప్పు. కరివేపాకు- 2 రెమ్మలు కొత్తిమీర -కొద్దిగా నిమ్మరసం -2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర -1/2 టీస్పూన్ వెల్లుల్లి ముక్కలు -1/2 టీస్పూన్ పసుపు -1/4 టీస్పూన్ పచ్చిమిర్చి -3 వేరుశెనగలు -2 టేబుల్ స్పూన్స్ పెద్ద ఉల్లిపాయ- 1/2 పచ్చి బఠాణి -3 టేబుల్ స్పూన్స్, ఉప్పు -తగినంత

తయారీ విధానం:

ముందుగా అటుకులను నీటిలో కడిగి ఆ తర్వాత నీరు లేకుండా నెమ్మదిగా పిండి పక్కన పెట్టుకోవాలి. జల్లెడలో నీరు ఇంకే వరకు అందులో పెట్టాలి. జల్లెడ లేకపోతే ఏదైన వస్త్రంతో పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్‌పై పెనం పెట్టి తగినంత నూనెను వేడి చేయాలి. ఆ తర్వాత జీలకర్ర, వేరుశెనగ పప్పు, పచ్చి మిర్చి, పసుపు, వెల్లుల్లి ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. చివర్లో ఉలిపాయ ముక్కలు, పచ్చి బఠాణిలు వేసి కాసేపు వేయించాలి. ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను అందులో వేసి బాగా కలపాలి. అటుకులు వేగేప్పుడు స్టవ్ ఆన్‌లోనే ఉండాలి. నిమ్మరసంలో తగినంత ఉప్పు వేసి కలపండి. ఆ మిశ్రమాన్ని అటుకుల్లో వేసి.. అది మొత్తం అటుకులలో కలిసిపోయేంతవరకు కలుపుతునే ఉండాలి. అంతే రుచికరమైన పోహా రెడీ. దీనిని మరింత అందంగా చేయాలనుకుంటే టమోటా, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. పోహాలో మిక్చర్ వేసుకుంటే కరకరలాడుతూ మరింత టేస్టీగా ఉంటుంది. నిమ్మకాయ కలపకుండా కూడా పోహాను తయారు చేసుకోవచ్చు. మరీ ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రుచికరమైన పోహాను రెడీ చేసేయండి.

Also Read:

బ్లాక్ హెడ్స్‏తో ఇబ్బంది పడుతున్నారా ? మీ డైట్‏లో ఈ మార్పులు చేసుకోవాలంటా.. నిపుణుల సూచనలు..

Follow Us
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
మీరు చేతులు కట్టుకునే విధానమే..మీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్తుంది
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
ఏజెంట్ల ద్వారా ట్రైన్‌ టికెట్స్‌ బుక్‌ చేస్తున్నారా?
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
అర్ధరాత్రి దిండుతో కరెంట్ ఆఫీస్‌కు వచ్చిన మహిళ..!
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
మూడు చిలుకలు కథ: కష్టపడి చేసే పనికి ఫలితం ఉంటుంది
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
ఈ టాలీవుడ్ హీరో ఇండియాలోనే బిగ్గెస్ట్ జ్యూయెలరీ మాల్ ఓనర్
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
విరిగిన ఎముకలకు బలాన్నిచ్చే తమలపాకుల ఫిష్ ఫ్రై.. ఇంత రుచా..
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
పదో తరగతి అర్హతతో అంగన్వాడీ కేంద్రాల్లో 230 ఉద్యోగాలు.. నో ఎగ్జాం
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
డీ-మార్ట్‌లో చౌకగా షాపింగ్ చేయడం ఎలా? ఎవ్వరికి తెలియని టిప్స్‌!
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది
పచ్చి గుడ్డు వర్సెస్ ఉడికించిన గుడ్డు.. ఆరోగ్యానికి ఏది మంచిది
పీఓకేను వణికిస్తున్న ‘లాహోర్ కసాయి’..!
పీఓకేను వణికిస్తున్న ‘లాహోర్ కసాయి’..!