పాలకంటే బీర్‌ బెటర్‌..మందుబాబులకు కిక్కే కిక్కు..

పాలు తాగండి హెల్దీగా ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పటివరకు ఇవన్నీ వైద్యులు, పెద్దలు చెప్పే ఆరోగ్య సూత్రాలు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. గ్లాస్‌ పాల కంటే బీర్‌ మంచిదట. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ జంతు సంరక్షణ సంస్థ పెటా ఈ ప్రకటన చేసింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సర్వే రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయం వెల్లడించింది. పాలకంటే బీర్‌ మంచిదని..ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని […]

పాలకంటే బీర్‌ బెటర్‌..మందుబాబులకు కిక్కే కిక్కు..
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Dec 05, 2019 | 7:40 PM

పాలు తాగండి హెల్దీగా ఉంటారు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఇప్పటివరకు ఇవన్నీ వైద్యులు, పెద్దలు చెప్పే ఆరోగ్య సూత్రాలు. కానీ ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. గ్లాస్‌ పాల కంటే బీర్‌ మంచిదట. షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. ఎవరో ఆషామాషీగా చెప్పిన విషయం కాదు. సాక్షాత్తూ జంతు సంరక్షణ సంస్థ పెటా ఈ ప్రకటన చేసింది. హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ సర్వే రిపోర్ట్‌ ఆధారంగా ఈ విషయం వెల్లడించింది. పాలకంటే బీర్‌ మంచిదని..ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని బల్ల గుద్ది మరీ చెబుతోంది.పైగా పాలు, పాల ఉత్పత్తులతో రోగాల బారిన పడే అవకాశముందట. ఒబెసిటీ, డయాబెటీస్‌, కేన్సర్‌ లాంటి జబ్బులతో పాటు ఎముకలు బలహీనంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది. అందుకే పాలతో పోల్చితే బీర్‌ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు పెటా ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ట్రేసీ రీమాన్‌. బీర్‌ బలవర్థక ఆహారమని అంటున్నారు. ఇందులో భాగంగా అమెరికాలోని విస్కాన్సిన్‌ యూనివర్సిటీ-మాడిసన్‌ క్యాంపస్‌కు సమీపంలో గాట్‌ బీర్‌ పేరుతో బోర్డును ఏర్పాటుచేసింది. ఐతే 2000లోనే బీరుకు మద్దతుగా పెటా ప్రచారం చేసినా పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో పెటా వెనక్కు తగ్గింది.

కానీ ఇప్పుడు మళ్లీ పాత పాటే పాడుతోంది. పాల కంటే బీరే బెటరని గంటా పథంగా చెబుతోంది. బీరుతో ఎముకలు ధృడంగా మారుతాయని..ఆయుష్షు పెరుగుతుందని తెలిపింది. పాలు తాగడం మానేసి బీరు బాటిల్‌ పట్టుకోండని చెప్తోంది. ఇదంతా చూస్తుంటే ఇక పెటా ప్రకటనతో మందుబాబులను ఎవరూ ఆపలేరని అంటున్నారు కొంతమంది. ఆరోగ్యానికి హానికరం అన్నప్పుడే పట్టించుకోని బీరుప్రియులు..ఆరోగ్యానికి మంచిదని తెలియడంతో ఇక యథేచ్చగా బీర్‌ కొట్టేందుకు రెడీ అయిపోతారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.