చిట్టి ఆవాలు ..బోలేడు ప్రయోజనాలు..తెలిస్తే షాకే !
మన వంటింటి పోపుల డబ్బా ఓ ఔష గని అన్నారు పెద్దలు. మనం నిత్యం వాడే పోపుదినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే..నిజంగానే షాక్ అవుతారు. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము కలిగి ఉన్న ఆవాలు ఆయుర్వేద చికిత్సలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, డైటరీ ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, ఫాట్, బీటా […]
మన వంటింటి పోపుల డబ్బా ఓ ఔష గని అన్నారు పెద్దలు. మనం నిత్యం వాడే పోపుదినుసులలో ఆవాలు కూడా ఒకటి. ఆవాల వల్ల రుచి, వాసన మాత్రమే కాదు బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చిట్టి ఆవాలు చేసే మేలు తెలిస్తే..నిజంగానే షాక్ అవుతారు. మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్, జింక్, ఒమెగా 3 ఫ్యాటియాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్దము కలిగి ఉన్న ఆవాలు ఆయుర్వేద చికిత్సలో ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాదు, డైటరీ ఫాట్స్, కార్బొహైడ్రేట్స్, ఫాట్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి4, బి5, బి6, బి9, సి, ఇ, కె, పొటాషియం, సోడియం వంటివి అధిక మోతాదులో ఉన్నాయి. పోషకవిలువలతో పాటుగా ఆవాలు ఎన్నో ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నాయి. అవేంటో చూద్దాంః * ప్రతిరోజూ నాలుగు గ్రాముల ఆవాలను తినటం ద్వారా జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. * ఆవాలతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు. * గొంతునొప్పి, దగ్గు జ్వరం ఉన్నప్పుడు మరుగుతున్న నీళ్లలో చిటికెడు ఆవపోడి, తగినంత తేనె వేసి ఇస్తే మేలు చేస్తుంది. * కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా ఆవాలు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఆవాల ముద్దను, కర్పూరంతో కలిపి కీళ్లపై రాసుకుంటే నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. * ఆవాల్లో ఉండే ఘాటైన నూనెలు క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడతాయి. ఇవి రక్తప్రసరణను వేగవంతం చేస్తుంటాయి. * ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని తలనొప్పి వస్తున్న వైపు లేపనంగా రాస్తే మైగ్రేన్ తలనొప్పి కూడా పోతుంది. * జుట్టు రాలిపోవటం, బట్టతల ఏర్పాడే లక్షణాలు కనిపించిన చోట పచ్చి ఆవాలను నీటితో కలిపి మెత్తగా నూరి దాన్ని చేదు ఆవాల తైలంతో కలిపి రాస్తే..మళ్లీ కొత్త వెంట్రుకలు పుట్టుకొస్తాయి. * ఎక్కువగా వాంతులు, నీళ్ల విరేచనాలవుతుంటే.. ఆవాల పొడిని కడుపు భాగంలో రాసుకోవాలి. ఇలా చేస్తే తక్షణమే ఉపశమనం లభిస్తుంది. * పంటి నొప్పి కలిగినపుడు గోరువెచ్చటి నీటిలో ఆవాలు వేసి కాసేపటి తర్వాత ఆ నీటిని పుక్కిలిస్తే నొప్పి తగ్గుతుంది. * చర్మంపై ఏర్పడే పులిపిర్లను ఆవ పొడి తొలగిస్తుంది. ఆవ పొడిని మెత్తని మిశ్రమం చేసి దాన్ని పులిపిర్లపై రాయడం ద్వారా అవి ఎండిపోయి రాలిపోతాయి. * శరీరంలో వ్యర్థాలను బయటకు నెట్టి కొవ్వును తగ్గించే గుణం ఆవాలకి ఉంది. ఇన్నీ ఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న చిన్ని ఆవాలను, ఇక అంత తేలిగ్గా తీసి పారేయకండి !