మన ఇంట్లో యాపిల్ చెట్లను పెంచడం ఎలా..?

మన ఇంట్లో యాపిల్ చెట్లను పెంచడం ఎలా..?

ఏంటి ఈ మాట వినగానే షాక్ అవుతున్నారా..? నిజంగానే.. యాపిల్ చెట్లను మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా.. ఈ చెట్లు.. ఎక్కువగా.. జమ్మూ కాశ్మీర్.. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎందుకంటే.. అక్కడి శీతల ప్రదేశాల కారణంగా.. నాణ్యమైన యాపిల్స్ లభ్యమవుతాయి. అయితే.. చిన్న చిన్న టెక్నిక్స్‌ని పాటిస్తే.. వాటిని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు. అలాగే.. బోన్సాయ్ చెట్లుగా వీటిని ఇళ్లలో పెంచుకోవచ్చు. అప్పుడప్పుడు మనం యాపిల్స్ తింటూనే […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 08, 2019 | 7:17 AM

ఏంటి ఈ మాట వినగానే షాక్ అవుతున్నారా..? నిజంగానే.. యాపిల్ చెట్లను మన ఇంట్లో కూడా పెంచుకోవచ్చు. అదెలాగా అని ఆలోచిస్తున్నారా..? సాధారణంగా.. ఈ చెట్లు.. ఎక్కువగా.. జమ్మూ కాశ్మీర్.. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఎందుకంటే.. అక్కడి శీతల ప్రదేశాల కారణంగా.. నాణ్యమైన యాపిల్స్ లభ్యమవుతాయి. అయితే.. చిన్న చిన్న టెక్నిక్స్‌ని పాటిస్తే.. వాటిని మన ఇంట్లోనే పెంచుకోవచ్చు.

అలాగే.. బోన్సాయ్ చెట్లుగా వీటిని ఇళ్లలో పెంచుకోవచ్చు. అప్పుడప్పుడు మనం యాపిల్స్ తింటూనే ఉంటాం. అయితే.. అందులోని నల్లటి విత్తనాలను పడేయకుండా.. వాటి ద్వారానే ఈ చెట్లను పెంచుకోవచ్చు. మార్కెట్లో కూడా వీటి విత్తనాలు దొరుకుతాయి. ధర ఎక్కువైనా.. కొంత మంది వీటిని కొనుగోలు చేసి.. యాపిల్ పండ్ల చెట్లను పెంచుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. ఈ క్రింది పద్దతులను జాగ్రత్తగా పాటిస్తే.. మన ఇంటి యాపిల్స్‌ని తినవచ్చు.

1. యాపిల్ చెట్లను పెంచడం చాలా ఈజీనే.. కాకపోతే.. ప్రత్యేకంగా సమయం కేటాయించాలి. 2. ఎర్రగా ఉన్న యాపిల్స్ గింజలైతే.. తొందరగా.. మొలకెత్తే అవకాశం ఉంటుంది. 3. మనం చేతులు తుడుచుకునే టిష్యూని.. లైట్‌గా తడుపుకుని.. యాపిల్ విత్తనాలను ఆ టిష్యూ మీద వేయాలని.. క్లోజ్ చేసి.. సీల్డ్ బాక్స్‌లో కానీ.. డబ్బాలో కానీ వేసి మూత పెట్టాల్సి ఉంటుంది. రెండు రోజులకొకసారి.. వేరే పేపర్ మీద.. ఇదే ప్రకారంగా.. పాత టిష్యూలో ఉన్న విత్తనాలను కొత్త టిష్యూలో వేసుకోవాలి. ఇలా రెండు సార్లు చేసుకోవాలి. 4. ఆ తరువాత వాటిని.. ఓ కుండీలో నాటాలి. ఇంట్లో లేదా.. మార్కెట్‌లో దొరికే వర్మీ కంపోస్టును వేయాలి. 5. ఇలా 15 రోజులకొకసారి లేదా నెల రోజులకొకసారి వాటిని గుల్ల చేస్తూ ఉండాలి. 6. ఈ యాపిల్ చెట్లకు నీళ్లు తక్కువ పోయాలి. 7. అలాగే.. రోజుకు ఒక గంట ఎండలో ఉంచాలి. 8. మామూలు చెట్లలాగే.. వీటికి కూడా.. ఆయిల్, ఎగ్, సొంతంగా తయారు చేసుకున్న వర్మీ కంపోస్ట్ ఉంటే సరిపోతుంది. 9. అయితే.. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి.. వీటిని పెంచడం కొంచెం సులువే. కాగా.. వీటిని అత్యంత జాగ్రత్తగా.. శ్రద్ధగా పెంచాల్సి ఉంటుంది. మీరు ఈ చెట్లుకు కాస్త శ్రమను పెడితే.. నాణ్యమైన.. ప్రకృతి సిద్ధమైన యాపిల్స్‌ని తినవచ్చు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu