ఏపీలో మొదటి జీరో ఎఫ్‌ఐఆర్ కేసు..ఆగమేఘాలపై స్పందించిన పోలీసులు
ఏపీలో మొదటి ఎఫ్‌ఐఆర్ కేసు నమోదయ్యింది. కేసు తమ పరిధిలోకి రానప్పటికి కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జిల్లాలోని వీరులపాడు మండలం రంగాపురానికి చెందిన బాలుడు కిడ్నాపునకు సంబంధించి, అతని తండ్రి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డివిజన్‌లోకి రానప్పటికి కంచికచర్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వెంటనే యాక్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపి, తెలంగాణలోని మిర్యాలగూడ మండలంలో బాలుడి ఆచూకి కనుగొన్నారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. దిశ హత్యాచార […]
ఏపీలో మొదటి ఎఫ్‌ఐఆర్ కేసు నమోదయ్యింది. కేసు తమ పరిధిలోకి రానప్పటికి కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. జిల్లాలోని వీరులపాడు మండలం రంగాపురానికి చెందిన బాలుడు కిడ్నాపునకు సంబంధించి, అతని తండ్రి కంచికచర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ డివిజన్‌లోకి రానప్పటికి కంచికచర్ల పోలీసులు ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. వెంటనే యాక్షన్ టీమ్స్‌ను రంగంలోకి దింపి, తెలంగాణలోని మిర్యాలగూడ మండలంలో బాలుడి ఆచూకి కనుగొన్నారు. దీంతో కిడ్నాప్ కథ సుఖాంతం అయింది.
దిశ హత్యాచార ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. దిశ తల్లిదండ్రులు మిస్సింగ్ కేసు ఫైల్ చెయ్యడానికి వెళ్లినప్పడు పోలీసులు తమ పరిధిలోకి రాదంటూ వారిని తిరిగి పంపించేయడం సంచలనంగా మారింది. ఈ ఘటనపై అంతర్గత విచారణ చేసిన తెలంగాణ పోలీసు శాఖ ముగ్గురు పోలీసు సిబ్బందిపై వేటు వేసింది. కేసు తమ పరిధిలోకి రాకపోయినా తక్షణ ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లకు తెలంగాణ డీజీపీ ఆఫీసు నుంచి ఆదేశాలు అందాయి. ఇదే నిర్ణయాన్ని ఏపీ డీజీపీ గౌతం సవాంగ్ సైతం తీసుకున్నారు. జీరో ఎఫ్‌ఐఆర్ విధానాన్ని రాష్ట్రమంతటా అమలు పరుస్తున్నట్టు రెండు రోజుల క్రితం పేర్కొన్నారు.