బిగ్‌ న్యూస్: చరిత్ర రికార్డులను బ్రేక్ చేసిన ఉల్లి..!

ఉల్లి బంగారుమయం అయిపోయింది. పసిడి మాదిరి.. పైపైకి ఎగబాకుతున్నాయి ఉల్లి ధరలు. ఉల్లి ప్రకంపనలకు సదరు వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉల్లి ధరలు మరింత పెరిగాయి. చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బ్రేక్ చేసి.. ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది ఉల్లి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా.. కిలో ఉల్లి.. 175 రూపాయలకు చేరింది. రెండు రోజుల్లోనే.. క్వింటాల్ ఉల్లి.. ధర రెండు వేల రూపాలయకు పెరిగింది. మలక్ పేట్‌ […]

బిగ్‌ న్యూస్: చరిత్ర రికార్డులను బ్రేక్ చేసిన ఉల్లి..!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 05, 2019 | 12:47 PM

ఉల్లి బంగారుమయం అయిపోయింది. పసిడి మాదిరి.. పైపైకి ఎగబాకుతున్నాయి ఉల్లి ధరలు. ఉల్లి ప్రకంపనలకు సదరు వినియోగదారులు బెంబేలెత్తి పోతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఉల్లి ధరలు మరింత పెరిగాయి. చరిత్రలో ఇప్పటి వరకూ ఉన్న రికార్డులను బ్రేక్ చేసి.. ఆల్‌టైమ్ రికార్డు నమోదు చేసింది ఉల్లి. దీంతో.. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఏకంగా.. కిలో ఉల్లి.. 175 రూపాయలకు చేరింది. రెండు రోజుల్లోనే.. క్వింటాల్ ఉల్లి.. ధర రెండు వేల రూపాలయకు పెరిగింది. మలక్ పేట్‌ మార్కెట్ యార్డులో.. క్వింటా ఉల్లి రూ.14 వేలు పలుకుతోంది.

ఇక దీంతో.. ప్రజలు ఉల్లి పాయలను కొనేటట్టుగా లేరు. ఇప్పటికే.. పెరిగిన రేట్లతో.. వినియోగదారులు లబోదిబోమంటుంటే.. ఇప్పుడు పెరిగిన ఈ రేటుతో.. మరింత ఇబ్బంది పడక తప్పేటట్టుగా లేదంటున్నారు. హోల్ సేల్ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.150లు పలుకుతుంటే.. బహిరంగ మార్కెట్‌లోకి వచ్చేసరికి ఆ రేటు.. రూ.175లు అయ్యింది. ఒకవైపు ధరలు పెరిగి ప్రజలు కన్నీరు కారుస్తుంటే.. రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ పంటకు.. ఎక్కువ లాభం వస్తుందని సంబరపడుతున్నారు.