ఎదియూరప్పకి అగ్నిపరీక్ష.. కర్ణాటక ఉప ఎన్నికలు..!
కర్నాటకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం నుంచే.. ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా.. వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కాగా.. ప్రస్తుతం కర్నాటకలో.. 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కుమార స్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటు పడింది. దీంతో.. 15 అసెంబ్లీ స్థానాలకు […]
కర్నాటకలో ఉప ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 7 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. ఉదయం నుంచే.. ప్రజలు వారి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కూడా.. వారి ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. కాగా.. ప్రస్తుతం కర్నాటకలో.. 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కుమార స్వామి ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో వారిపై అనర్హత వేటు పడింది. దీంతో.. 15 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగగా.. మిగతా రెండు నియోజకవర్గాలకు సంబంధించి.. కోర్టులో కేసులు ఉన్న కారణంగా.. అక్కడ ఎన్నికలు తరువాత జరుగుతాయి. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్.. సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగుతుంది. ఈ నెల 9న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఈ ఉప ఎన్నికల్లో.. సీఎం ఎదియూరప్ప భవితవ్యం తేలనుందని అంటున్నారు.
#KarnatakaByelection: People queue up at a polling station in Hoskote, to cast their votes. pic.twitter.com/Q0uxLb6Txv
— ANI (@ANI) December 5, 2019