జనసేన భేటీలో ‘జగనన్న’కు నమస్కారం..షాక్‌లో పవర్‌స్టార్
జనసేన భేటీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు జగనన్నకు నమస్కారాలు అని ఓ మహిళ అనడంతో జనసేన పార్టీ వర్గాలతోపాటు పవన్ కల్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంగణం నవ్వులతో నిండిపోగా.. పవన్ కల్యాణ్ కొద్ది సేపటి దాకా తేరుకోలేదని సమాచారం. చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లిలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన డ్వాక్రా […]
జనసేన భేటీలో వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ సహా అక్కడున్న వారంతా షాకయ్యారు. ఏకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు జగనన్నకు నమస్కారాలు అని ఓ మహిళ అనడంతో జనసేన పార్టీ వర్గాలతోపాటు పవన్ కల్యాణ్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ప్రాంగణం నవ్వులతో నిండిపోగా.. పవన్ కల్యాణ్ కొద్ది సేపటి దాకా తేరుకోలేదని సమాచారం.
చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా మదనపల్లిలో పవన్ పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అనంతపురం జిల్లాకు చెందిన డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా వింత ప్రస్తావన రావడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి.
‘‘గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు జగనన్న గారికి’’ అంటూ ఓ మహిళ పవన్ కల్యాణ్‌ను సంబోధించారు. దాంతో ఉలిక్కి పడిన జనసేన నేతలు, పార్టీ వర్గాలు.. ఆ మహిళకు ఇది వైసీపీ మీటింగ్ కాదు.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. దాంతో ఆ మహిళ సర్దుకుని… మళ్ళీ మాట్లాడింది. తనను సంబోధించబోయి.. జగనన్న అనడంతో పవన్ కల్యాణ్ సైతం ముందు షాక్ గురయ్యారు.. ఆ తర్వాత గట్టిగా నవ్వేశారు. మహిళ తప్పిదాన్ని గుర్తించిన ఇతరులు ఆమెను కరెక్ట్ చేశారు. చివరికి నవ్వుల మధ్య సమావేశం కొనసాగింది.