రోదసిలో మరింత నిఘా.. ‘ పీఎస్ఎల్వీ-సీ-48 ‘ లాంచ్ కి ఇస్రో రెడీ..

రాడార్ తో భూఉపరితల అబ్జర్వేషన్ (భూగ్రహ పరిశీలన) కోసం ఉద్దేశించిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. లాంచ్ వెహికికల్ అయిన పీఎస్ఎల్వీ-సీ 48 రాకెట్.. ఈ శాటిలైట్ తో బాటు 9 కమర్షియల్ శాటిలైట్లను కూడా మోసుకువెళ్లనుంది. ఈ నెల 11 న ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాల్లో.. ఆరు అమెరికాకు చెందినవి కాగా.. మూడింటిలో ఒకటి ఇజ్రాయెల్ కు, మరొకటి ఇటలీకి, ఇంకొకటి జపాన్ కు చెందినవి. శ్రీహరికోటలోని […]

రోదసిలో  మరింత నిఘా.. ' పీఎస్ఎల్వీ-సీ-48 '  లాంచ్ కి ఇస్రో రెడీ..
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 05, 2019 | 2:15 PM

రాడార్ తో భూఉపరితల అబ్జర్వేషన్ (భూగ్రహ పరిశీలన) కోసం ఉద్దేశించిన ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ఇస్రో రెడీ అవుతోంది. లాంచ్ వెహికికల్ అయిన పీఎస్ఎల్వీ-సీ 48 రాకెట్.. ఈ శాటిలైట్ తో బాటు 9 కమర్షియల్ శాటిలైట్లను కూడా మోసుకువెళ్లనుంది. ఈ నెల 11 న ఈ రాకెట్ ను ప్రయోగించనున్నారు. ఈ తొమ్మిది వాణిజ్య ఉపగ్రహాల్లో.. ఆరు అమెరికాకు చెందినవి కాగా.. మూడింటిలో ఒకటి ఇజ్రాయెల్ కు, మరొకటి ఇటలీకి, ఇంకొకటి జపాన్ కు చెందినవి. శ్రీహరికోటలోని షార్ కేంద్రంలో గల తొలి లాంచ్ పాడ్ నుంచి పీ ఎస్ఎల్వీసీ-48.’ రిశాట్-2 బీఆర్ఐ ‘ ని లాంచ్ చేయనుందని ఇస్రో వర్గాలు తెలిపాయి. వాతావరణం అనుకూలించిన పక్షంలో.. ఈ నెల 11 వ తేదీ మధ్యాహ్నం 3 గంటల 25 నిముషాలకు ఈ రాకెట్ నింగిలోకి ఎగయనుంది. సుమారు 628 కేజీల బరువైన ఈ రాకెట్.. క్యూ ఎల్ కన్ఫిగరేషన్ లోని పీఎస్ఎల్వీ వరుస రాకెట్లలో రెండవది.

న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తో కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం..అంతర్జాతీయ కస్టమర్ శాటిలైట్స్ ని లాంచ్ చేస్తున్నట్టు ఈ వర్గాలు స్పష్టం చేశాయి. నిజానికి తాము 4 నుంచి 5 రిశాట్ ఉపగ్రహాలను ప్రయోగించాలని ల్లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో పేర్కొంది. వీటిలో ఒకదానిని ఈ ఏడాది మే 22 న ప్రయోగించారు. రోజువారీ ప్రాతిపదికపై ప్రత్యేక ప్రాంతం మీద నిఘా ఉంచేందుకు సెక్యూరిటీ వ్యవస్థలకు అంతరిక్షంలో కనీసం 4 రిశాట్ ఉపగ్రహాలు అవసరమవుతాయట. ఇటీవలే (నవంబర్ 27 న )అత్యంత ఆధునిక ‘ కార్టోశాట్-3 ‘ ని ఇస్రో ప్రయోగించింది. ఈ ఉపగ్రహం అప్పుడే పని చేయడం ప్రారంభించింది.

దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
ఏపీ, తెలంగాణలో సంక్రాంతి సెలవులు ఇవే.. ఎవరికి ఎన్ని రోజులంటే.?
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
తివారీ – గంభీర్‌కు కేకేఆర్ ఆటగాళ్ల మద్దతు!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు: ఐపీఎల్ జట్లకు నారాయణ్ జగదీశన్ పంచ్!
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు
టాటా గ్రూప్‌లో పెను మార్పులు.. నోయల్ టాటా కూతుళ్లకు కీలక బాధ్యతలు