సూర్యుని వద్దకు సోలార్ ప్రోబ్ రాకెట్.. ఈ ఐడియా భారత్‌దే..!

ఎట్టకేలకు సూర్యునికి చేరువగా.. పార్కర్ సోలార్ ప్రోబ్ చేరి రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా.. ఒక రాకెట్.. సూర్యుడికి అతి దగ్గరగా చేరడం కూడా ఇదే మొదటిసారి. దీంతో.. నాసా కష్టం దాదాపు ఫలించిందనే చెప్పవచ్చు. సూర్యునిలో దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ సోలార్ ప్రోబ్ రాకెట్‌ను నాసా పైకి పంపించింది. ఈ రాకెట్‌ని 2018 ఆగష్టు 13న నింగిలోకి పంపించింది నాసా. కాగా.. అయితే నాసా.. ఈ రాకెట్ ఐడియా.. భారత్‌ నుంచి తీసుకున్నదని […]

సూర్యుని వద్దకు సోలార్ ప్రోబ్ రాకెట్.. ఈ ఐడియా భారత్‌దే..!
Follow us

| Edited By:

Updated on: Dec 05, 2019 | 1:28 PM

ఎట్టకేలకు సూర్యునికి చేరువగా.. పార్కర్ సోలార్ ప్రోబ్ చేరి రికార్డ్ సృష్టించింది. అంతేకాకుండా.. ఒక రాకెట్.. సూర్యుడికి అతి దగ్గరగా చేరడం కూడా ఇదే మొదటిసారి. దీంతో.. నాసా కష్టం దాదాపు ఫలించిందనే చెప్పవచ్చు. సూర్యునిలో దాగి ఉన్న రహస్యాలను ప్రపంచానికి తెలియజేసేందుకు.. ఈ సోలార్ ప్రోబ్ రాకెట్‌ను నాసా పైకి పంపించింది. ఈ రాకెట్‌ని 2018 ఆగష్టు 13న నింగిలోకి పంపించింది నాసా.

కాగా.. అయితే నాసా.. ఈ రాకెట్ ఐడియా.. భారత్‌ నుంచి తీసుకున్నదని సమాచారం. భారతీయ రైతులు పంటపొలాల్లో ఉపయోగించే.. ఓ చిన్న చిట్కాను నాసా ఈ రాకెట్ వినియోగంలో పాటించింది. సాధారణంగా.. పంట పొలాల్లో.. పక్షులను వెళ్లగొట్టేందుకు.. వడిసెలని ఎలా ఉపయోగిస్తారో.. ఈ పార్కర్ సోలార్ ప్రోబ్‌కి కూడా.. అలాంటి.. విధానాన్నే ఉపయోగించినట్టు తెలుస్తోంది. పంటపొలాల్లో పక్షులని వెళ్లగొట్టేందుకు.. దారానికి రాయిని చుట్టి ఎంత వేగంగా.. చుట్టూ తిప్పితే అంత వేగంగా అది తిరుగుతుంది. ఇప్పుడు ఈ సోలార్ ప్రోబ్‌కి కూడా.. ఇదే పద్ధతిని అనుసరించారు.

సూర్యుడికి బుధుడు, శుక్రుడుకి ఉన్న గ్రావిటీ కారణంగా.. ఆ సర్కిల్ లోనుంచి బయట పడకుండా.. కక్ష్యలోనే పరిభ్రమించడానికి ఈ సరికొత్త విధానం తోడ్పడుతుందని వారు భావించారు. ఇది పరిభ్రమిస్తున్న సమయంలో.. సుర్యుని ఉపరితల భాగం (కరోనా) నుంచి ఛార్జితో కూడి వచ్చే అణువులు క్రమేపీ.. చెల్లాచెదురు అవుతాయని భావించినా.. ఆ తర్వాత ఇవి ఒక్కసారిగా.. కనుమరుగవుతూ వచ్చాయి. సౌర వాయువు వేగం కారణంగా.. హఠాత్తుగా ఏర్పడిన అయస్కాంత క్షేత్రం శాస్త్రజ్ఞలను ఆశ్చర్య పరిచింది. అత్యంత శక్తివంతమైన వాయువులు అంతరిక్షం నౌకను ‘వాష్ చేసినట్టు’ (కడిగివేసినట్టు) కనిపించాయని మిచిగన్.. యూనివర్శిటీ రీసెర్చర్లు తెలిపారు. ఈ తరంగాలు అత్యంత శక్తివంతమైనవి అని వారు పేర్కొన్నారు.

కాగా.. సూర్యుడి నుంచి వెలువడే రేడియేషన్‌ ప్రభావంతో.. అనేక ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. రక్త ప్రవాహంలో మార్పులతో రక్తపోటు వచ్చే అవకాశం ఉంటుంది. క్యాన్సర్‌ కూడా రావొచ్చని డాక్టర్లు హెచ్చరిస్తుంటారు. అందుకే సూర్యుడి రహస్యాన్ని తెలుసుకునేందుకు పార్కర్‌ సోలార్‌ ప్రోబ్‌ అంతరిక్షంలోకి పంపించారు.