బిగ్ బాస్‌లో పెళ్లిళ్ల పర్వం.. ఆ జంటకు రూ.2 కోట్ల భారీ డీల్!

బిగ్ బాస్‌లో పెళ్లిళ్ల పర్వం.. ఆ జంటకు రూ.2 కోట్ల భారీ డీల్!

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13 చివరి అంకానికి చేరుకుంది. ప్రతిరోజూ ప్రేక్షకులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్‌లో.. తాజాగా ప్రసారమైన రష్మీ దేశాయ్. అర్హన్ ఖాన్‌ల మధ్య లవ్ ఎపిసోడ్‌ అందరిని కట్టిపడేసింది. బిగ్ బాస్‌‌లో నటుడు సిద్ధార్థ్ శుక్లా తర్వాత.. రష్మీ దేశాయ్ చెప్పుకోదగిన స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె కోసమే చాలామంది ఫ్యాన్స్ షో చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. గత […]

Ravi Kiran

| Edited By: Pardhasaradhi Peri

Dec 05, 2019 | 5:09 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న హిందీ బిగ్ బాస్ సీజన్ 13 చివరి అంకానికి చేరుకుంది. ప్రతిరోజూ ప్రేక్షకులకు ఏదో ఒక సర్‌ప్రైజ్ ఇస్తూ ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్‌లో.. తాజాగా ప్రసారమైన రష్మీ దేశాయ్. అర్హన్ ఖాన్‌ల మధ్య లవ్ ఎపిసోడ్‌ అందరిని కట్టిపడేసింది.

బిగ్ బాస్‌‌లో నటుడు సిద్ధార్థ్ శుక్లా తర్వాత.. రష్మీ దేశాయ్ చెప్పుకోదగిన స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆమె కోసమే చాలామంది ఫ్యాన్స్ షో చూస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు. గత వారం ఎలిమినేట్ అయిన నటుడు అర్హన్ ఖాన్‌.. రష్మిపై తనకున్న ప్రేమను తెలపడానికి మరోసారి వైల్డ్ కార్డు ఎంట్రీగా హౌస్‌లోకి తిరిగి వచ్చాడు. గతంలో ఇద్దరూ లవర్స్.. కానీ కొన్ని కారణాల వల్ల విడిపోయారు. మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ వేదికగా కలిశారు.

అయితే ఇక్కడొచ్చిన ట్విస్ట్ ఏంటంటే.. తన ప్రేమను తెలపడానికి బంగారు ఉంగరంతో అర్హన్ ఖాన్‌ వచ్చినా.. రష్మీ తనకు తెలియదన్నట్లు ప్రవర్తించింది. అంతేకాకుండా అతను హౌస్ నుంచి బయటికి వెళ్లిన తర్వాత మరో కంటెస్టెంట్‌తో ఇదంతా చెప్పుకుని కన్నీటిపర్యంతం కావడం ఇప్పుడు ఫ్యాన్స్ అందరిని తెగ ఫీల్ అయ్యేలా చేస్తోంది. ఇదిలా ఉండగా  బిగ్ బాస్ ఈ జంటకు బంపర్ గిఫ్ట్ ప్రకటించాడు. ఒకవేళ రష్మీ, అర్హన్ ఖాన్‌లు బిగ్ బాస్ హౌస్‌లో పెళ్లి చేసుకుంటే.. రూ. 2కోట్లు పెళ్లి కానుకగా ఇస్తానని చెప్పాడు. మరి ఈ జంట ఈ ఆఫర్‌పై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ఇకపోతే రెండు లేదా మూడు సీజన్ల ముందు బిగ్ బాస్ హౌస్‌లో ఓ జంట పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో అది హాట్ టాపిక్ అయింది. దీనితో మళ్ళీ ఇప్పుడు హౌస్‌లో పెళ్లి జరిగితే తప్పకుండా షోకి ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పాలి. మరోవైపు సిద్ధార్థ్, రష్మీల రొమాన్స్‌కి తెరపడి.. వీరిద్దరి రొమాన్స్ షురూ కావడంతో టీఆర్పీ రేటింగ్స్ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu