AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stretch Marks: స్ట్రెచ్ మార్క్‌లతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి..

Stretch Marks: సాధారణంగా గర్భధారణ తర్వాత మహిళల్లో పొట్ట చుట్టూ చారలు, సాగిన గుర్తులు కనిపిస్తాయి. అలాగే, ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం

Stretch Marks: స్ట్రెచ్ మార్క్‌లతో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఈ టిప్స్ ట్రై చేయండి..
Stretch Marks
Shiva Prajapati
|

Updated on: Oct 14, 2021 | 2:05 PM

Share

Stretch Marks: సాధారణంగా గర్భధారణ తర్వాత మహిళల్లో పొట్ట చుట్టూ చారలు, సాగిన గుర్తులు కనిపిస్తాయి. అలాగే, ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం వలన కూడా ఇలాంటి స్ట్రెచ్ మార్క్‌లు వస్తాయి. మహిళలు మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. అయితే, ఈ చారలను తొలగించుకోవడానికి చాలా మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అయితే, ఈ చారలు తొలగించుకునేందుకకు చౌకైన, సురక్షితమై సహజసిద్ధ పదార్థాలు మన ఇంట్లో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. స్ట్రెచ్ మార్క్స్‌ని తొలగించుకునేందుకు హోమ్ రెమెడీస్ బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు. మరి ఆ హోమ్ రెమిడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కలబంద.. సహజ వైద్యం చేసే ఏజెంట్‌గా ఇది పనిచేస్తుంది. మీ శరీరంపై ఉన్న స్ట్రెచ్ మార్క్స్‌పై తాజా అలోవెరా జెల్ అప్లై చేసి 20 30 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేయాలి. కొన్ని రోజుల్లోనే మీకు మంచి ఫలితం కనిపిస్తుంది.

కోకో వెన్న.. చర్మ ఆరోగ్యానికి ఇది ఒక ప్రముఖ హోం రెమెడీ. ఇది స్ట్రెచ్ మార్కులను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. కోకో వెన్న కోకో బీన్స్ నుండి తయారవుతుంది. రాత్రిపూట స్ట్రెచ్ మార్క్స్‌పై అప్లై చేసి ఉంచాలి. గర్భధారణ సమయంలో ఏర్పడిన చారలపై ఇది అప్లై చేసినట్లయితే.. మంచి ఫలితం ఉంటుంది. సాగిన గుర్తులు పూర్తిగా కనిపించకుండా పోతాయి.

చక్కెర స్క్రబ్.. షుగర్ స్క్రబ్‌ను ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయడం వల్ల చర్మం ఎక్స్‌ఫోలియేట్ అవుతుంది. ఇది మీ సాగిన గుర్తులను తొలగించడంలో సహాయపడుతుంది. స్క్రబ్ చేయడానికి, ఒక కప్పు చక్కెరలో 1/4 కప్పు బాదం నూనె లేదా కొబ్బరి నూనె కలపాలి. దానికి కొద్దిగా నిమ్మరసం కలపాలి. స్నానం చేయడానికి ముందు వారానికి 3 నుండి 4 సార్లు ఈ స్క్రబ్ అప్లై చేయాలి. ఈ స్క్రబ్‌తో సుమారు 8 నుంచి 10 నిమిషాలు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

కొబ్బరి నూనే.. కొబ్బరిలో వైద్య లక్షణాలు ఉన్నాయి. చర్మ గాయాలను వేగంగా నయం చేయగలవని అనేక అధ్యయనాల్లో నిరూపితమైంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న చోట కొబ్బరి వర్జిన్ ఆయిల్ అప్లై చేయాలి. ఆ తరువాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది అద్భుతంగా పనిచేస్తుంది.

దోసకాయ, నిమ్మ మిశ్రమం.. నిమ్మరసం మచ్చలను నయం చేయడానికి, తగ్గించడానికి సహాయపడుతుంది. దోసకాయ రసం కూల్ చేస్తుంది. తద్వారా మీ చర్మం తాజాగా కనిపిస్తుంది. నిమ్మరసం, దోసకాయ రసాన్ని సమాన పరిమాణంలో మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేసి 10 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Also read:

Indian Railways: మనం పట్టించుకోం కానీ బాబోయ్.. మన రైలు ప్రయాణాలలో ఇబ్బందుల లెక్క చూస్తే మతి పోతుంది!

Mother Feed: అసలే కరోనా కాలం.. పిల్లలకు తల్లి పాలు ఇస్తున్నారా?.. అయితే ఈ విషయం పక్కా తెలుసుకోవాల్సిందే..

Lakhimpur Violence: లఖీంపూర్‌ ఖేరి ఘటనలో ఆశిశ్‌ మిశ్రా చుట్టు ఉచ్చు.. క్రైం స్పాట్‌కు సిట్ అధికారులు..