Lakhimpur Violence: లఖీంపూర్ ఖేరి ఘటనలో ఆశిశ్ మిశ్రా చుట్టు ఉచ్చు.. క్రైం స్పాట్‌కు సిట్ అధికారులు..
లఖీంపూర్ ఖేరి హింసాకాండలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. క్రైం స్పాట్‌కు ఆశిశ్‌ను తీసుకెళ్లి విచాణ జరిపారు పోలీసులు.
లఖీంపూర్ ఖేరి ఘటనలో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా చుట్టు ఉచ్చు బిగుస్తోంది. క్రైం స్పాట్‌కు ఆశిశ్‌ను తీసుకెళ్లి విచాణ జరిపారు పోలీసులు. ఈ కేసులో ఆశిశ్ మిశ్రాతో పాటు సహ నిందితుడిగా ఉన్న అంకిత్ దాస్ పోలీసు విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. రైతులకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని , వాళ్ల మీదకు కాన్వాయ్ దూసుకెళ్లాలని ఆశిశ్ మిశ్రా డ్రైవర్‌ను ఆదేశించాడని అంకిత్‌దాస్ సిట్ విచారణలో తెలిపాడు. దీంతో ఆశిశ్ మిశ్రా కష్టాలు రెట్టింపయ్యాయి.
లఖీంపూర్ ఘటన జరిగినప్పుడు తాను అక్కడ లేనని , వేరే ప్రాంతంలో ఉన్నట్టు వాదిస్తున్నాడు ఆశిశ్ మిశ్రా . కాని అంకింత్‌దాస్ విచారణతో సంచలన విషయాలు వెలుగు లోకి వచ్చాయి. ఆందోళన చేస్తున్న రైతులపై అంకిత్‌దాస్ కాల్పులు జరిపినట్టు కూడా అభియోగాలు నమోదయ్యాయి. అయితే రైతులను ఢీకొట్టిన తరువాత జీపు బోల్తా పడిందని . డ్రైవర్‌ను ను బయటకు లాగి చంపేశారని అంకిత్ దాస్ తెలిపాడు. ప్రాణరక్షణ కోసమే తాను కాల్పులు జరిపినట్టు అంకిత్ దాస్ తెలిపాడు.
ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..
Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం
SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..
Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..