Dasara Naivedyam: రేపు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం.. నైవేద్యంగా చక్కర పొంగలి.. తయారీ

Dasara Naivedyam: దేవి శరన్నవరాత్రులు ముగిశాయి. రేపు దసరా పండగ జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో..

Dasara Naivedyam: రేపు రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారి దర్శనం.. నైవేద్యంగా చక్కర పొంగలి.. తయారీ
Navaratri 9th Day
Follow us
Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2021 | 10:51 AM

Dasara Naivedyam: దేవి శరన్నవరాత్రులు ముగిశాయి. రేపు దసరా పండగ జరుపుకోవడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో గత తొమ్మిది రోజులుగా అమ్మవారు వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. రేపు దసరా రోజున అమ్మవారిని రాజరాజేశ్వరి దేవిగా అలంకరించి పూజిస్తారు.  రేపు అమ్మవారికి  కొంత మంది చక్కెర పొంగలిను నైవేద్యంగా సమర్పిస్తారు.  మరికొందరు రవ్వ పొంగలిని నైవేద్యంగా అమ్మవారికి నివేదిస్తారు. ఈరోజు బియ్యం తో చేసే చక్కర పొంగలి తయారీ విధానం తెలుసుకుందాం..!

కావలిసిన పదార్ధాలు :

కొత్త బియ్యం-ఒక కప్పు పెసరపప్పు-అర కప్పు బెల్లంపొడి-అర కప్పు చిక్కటి పాలు- 3 కప్పులు (లేదా కొంచెం పాలు, కొలతకు సరిపడిన నీరు) యాలకుల పొడి ఎండు కొబ్బరి ముక్కలు (అరకప్పు) నెయ్యి (కావల్సినంత ) జీడిపప్పు- 20 పలుకులు బాదం -20 కిస్మిస్- కొంచెం పచ్చకర్పూరం (చిటికెడు ఇది ఆప్షన్)

తయారీ విధానం : బియ్యం, పెసర పప్పును శుభ్రంగా కడిగి.. నీరు పోసుకుని ఒక అరగంట పాటు నాన బెట్టి అలా ఉంచెయ్యాలి. అనంతరం నీరు లేకుండా బియ్యం . పెసర పప్పుని వడకట్టుకోవాలి. స్టౌ మీద బాణలి పెట్టి.. నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, బాదాం, కిస్ మిస్ లను ఒకొక్కటిగా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత మరికొంచెం నెయ్యి వేసి వేడి ఎక్కిన తర్వాత బియ్యం, పెసర పప్పును దోరగా వేయించుకోవాలి. ఇంతలో మరో స్టౌ పై మందపాటి గిన్నె పెట్టుకుని పాలు పోసి మరగబెట్టుకోవాలి. తర్వాత అందులో వేయించిన బియ్యం, పెసర పప్పుని వేసి గరిటతో తిప్పుతూ.. బాగా ఉడికించుకోవాలి. కొంచెం మెత్తగా ఉడికిన తర్వాత పంచదార లేదా బెల్లం పొడి వేసి బాగా కలపాలి. దగ్గర పడిన తర్వాత నేతిలో వేయించుకున్న ఎండు కొబ్బరి ముక్కలు జీడిపప్పు, బాదాం , కిస్ మిస్ లను వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి వేసుకుని మిగిలిన నెయ్యి వేసుకుని దింపేసుకోవాలి.. ఇష్టమైన వారు పచ్చకర్పూరం కొంచెం వేసుకోవచ్చు.  అంతే అమ్మవారికి ఇష్టమైన చక్కర పొంగలి రెడీ… నైవేద్యంగా సమర్పించి అమ్మవారి కృపకు పాత్రులు కండి..

Also Read:

దసరా ఉత్సవాల్లో ప్రధానమైన ఆయుధపూజ ఈరోజు.. ఎందుకు చేస్తారు..ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఏమిటి?

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!