Araku Train Trip: రారమ్మంటున్న ప్రకృతి సోయగం ఆంధ్రా ఊటీ.. తిరిగి ప్రారంభమైన థ్రిల్లింగ్ రైలు ప్రయాణం..
ప్రకృతి సోయగాలతో అలరారే ఆంధ్రా ఊటీ సరికొత్త కళ సంతరించుకుంటోంది. కొద్ది నెలలుగా కరోనాతో పర్యాటకులు లేక కళావిహీనంగా మారిన అందమైన లోయలు ఆకట్టుకునే సదుపాయాలతో అతిథులను రారమ్మని ఆహ్వానిస్తోంది.
పేరు ఆంధ్రా ఊటీ అంటారు కానీ.. అంతకుమించిన పర్యాటక ప్రదేశాలు ఇక్కడ కొకొల్లలు.. బొర్ర కేవ్స్ నుంచి బృందావనం పార్కు.. కాఫీ తోటల నుంచి ఆదివాసి మ్యూజియం వరకూ ఎన్నో వింతలు.. విశేషాలు. అందుకే దేశవిదేశీ పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. హాలిడేస్‌లో సేదతీరుతుంటారు. అలాంటివారికి విశాఖపట్నం నుంచి అరకు ప్రయాణం కూడా ఓ థ్రిల్లింగ్. కొత్తవలస – కిరండల్ లైన్లో నడిచే ఏకైక పాసింజర్ రైలు ఇది. ఉదయం 6 గంటలకు విశాఖలో రైలెక్కితే.. నాలుగు గంటల తర్వాత అరకు చేర్చుతుంది. మార్గమధ్యలో ఎన్నో మధురానుభూతులను అనుభవాన్ని పంచుతూ సాగుతోంది ఈ ప్యాసింజర్. ఎత్తయిన కొండలు ఆ కొండలపై నుంచి జాలువారే జలపాతాలు.. లోయలు.. కొండ గుహలోంచి సాగే ఈ రైలు ప్రయాణం పర్యాటకులను మధురానుభూతిని పంచుతుంది. అందుకే ఈ రైల్ అంటే అంత క్రేజ్. లగ్జరీ కార్లున్నా, ఏసీ వాహనాలు ఉన్నా రైలు ప్రయాణం చేయడానికే పర్యాటకులు అమితాసక్తి చూపుతుంటారు.
అద్దాలబోగి లేకుండా ప్రయాణం సాగితే సమ్ థింగ్ ఇంపార్టెంట్ మిస్ అయినట్టే. కరోనా కష్టాలు… సాంకేతిక సమస్యలతో కొంతకాలంగా అరకు టూరిస్టులకు మధురానుభూతులు దూరమయ్యాయి. దీంతో పర్యాటకులు నిరుత్సాహానికి గురౌతున్నారు. మళ్ళీ తాజాగా ఒకటి కాదు.. ఏకంగా రెండు అద్దాల భోగిలు రెడీ చేశారు. కిరండోల్ పాసింజర్ కు అనుసంధానించి ట్రైల్ రన్ పూర్తిచేశారు. గతంతో పోలిస్తే ఈ విస్టాడోమ్ కోచ్‌లకు అత్యాధునిక హంగులను అద్దారు. ఆకట్టుకునే ఎర్రటి రంగుతో కుర్చీలు, ఫలహారాలు తినేలా సీట్ల ముందు ఏర్పాట్లు, సెల్ ఫోన్ ఛార్జింగ్ పాయింట్లున్నాయి. భోగి సీలింగ్ కు అద్దాలను అమర్చారు.
రైలు ప్రయాణం లో ఎండ ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్ గా సీలింగ్ డోర్లు మూసుకునేలా ఏర్పాటు చేశారు. సేఫ్టీలోనూ జాగ్రత్తలు తీసుకున్నారు. సీసీ కెమెరాలను అమర్చారు. ప్రమాదాలు జరగకుండా టెక్నాలజీ వాడుతున్నారు. మెట్రో ట్రైన్ల తరహాలో ఉచిత వైఫై, ఆటోమేటిక్ డోర్లు అదనపు ఆకర్షణ. ట్రయల్ రన్ కూడా పూర్తిచేసి రెడీ చేశారు అధికారులు. మరికొద్ది రోజుల్లో అద్దాల బోగీలు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుండడంతో టూరిస్టుల ఆనందానికి అవధులు లేవు.
వచ్చే నాలుగైదు నెలలు అరకు సీజన్. దీంతో భారీగా డిమాండ్ ఏర్పడుతుంది. సాధారణంగా కిరండోల్ వరకు పాసింజర్ రైలు వెళ్తుంది. అయితే అద్దాల బోగీలు మాత్రం అరకు వరకే ఉండేలా ప్లాన్ చేశారు… మరి ఇంకెందుకు ఆలస్యం.. కొండకోనలు… సెలయేర్లు.. గుహలను దాటుకుంటూ సాగే ఈ ప్రయాణానికి మీరు రెడీ అయిపోండి.
ఇవి కూడా చదవండి: Teacher Beating: అమ్మో.. సారు కొట్టుడు మాములుగా లేదుగా.. విద్యార్థులను మరో రేంజ్‌లో చితకబాదిన టీచర్..
Potato Cheela Recipe: ఆలుతో అద్భుమైన బ్రేక్‌ఫాస్ట్.. పిజ్జాను మించిపోయే రుచి.. ఇంకెందుకాలస్యం
SBI: దాచుకోవడమే కాదు.. సంపాదించడం కూడా తెలుసుకోండి.. ఎస్‌బీఐ అందించే అద్భతమైన డిపాజిట్ స్కీమ్..
Chanakya Niti: జీవితంలో ఈ మూడింటిని వదిలేస్తే.. ధన లక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది..