Pandals in Kolkata: కోల్ కతాలో వైభవంగా జరుగుతున్న దసరా ఉత్సవాలు.. ఆకర్షణీయంగా పండల్స్
Surya Kala |
Updated on: Oct 13, 2021 | 9:07 PM
Kolkata Dasara: బెంగాలీయులకు ముఖ్యమైన పండగ దసరా. నవరాత్రుల్లో దుర్గాపూజను నిర్వహిస్తారు. సప్తమి, అష్టమి, నవమి తిథుల్లో దుర్గామాతకు పూజ చేసి 9వ రోజున కాళికామాతను దర్శిస్తారు. దేవి నవరాత్రులు తొమ్మిది రోజులూ రాష్ట్రమంతా హరికథలు, పురాణ శ్రవణం లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. చివరి రోజున దుర్గామాతను హుగ్లీ నదిలో నిమజ్జనం చేస్తారు. ఆరోజున నదీతీరంలో కుమారీ పూజలు చేయడం బెంగాలీల ప్రత్యేకత.