Beauty Tips: చుండ్రుతో బాధపడుతున్నారా? ఐతే ఈ హెయిర్‌ మాస్కులు ట్రై చేయండి..

దుమ్ము, ధూళి, కాలుష్యం మూలంగా చుండ్రు సమస్య త్వరగా తలెత్తుతుంది. చుండ్రు సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే జుట్టు రాలడం, చిట్లడం వంటివి తలెత్తుతాయి. జుట్టు చిట్లిపోవడం, నిర్జీవంగా ఉండడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్‌ అవుతాయి..

Beauty Tips: చుండ్రుతో బాధపడుతున్నారా? ఐతే ఈ హెయిర్‌ మాస్కులు ట్రై చేయండి..
Hair Care Tips
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 6:34 PM

home remedies for hair growth: దుమ్ము, ధూళి, కాలుష్యం మూలంగా చుండ్రు సమస్య త్వరగా తలెత్తుతుంది. చుండ్రు సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే జుట్టు రాలడం, చిట్లడం వంటివి తలెత్తుతాయి. జుట్టు చిట్లిపోవడం, నిర్జీవంగా ఉండడం వల్ల వెంట్రుకలు డ్యామేజ్‌ అవుతాయి. ఈ విధమైన జుట్టు సమస్యలతో బాధపడేవారికి సౌందర్య నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు.

నిమ్మ – పెరుగుతో హెయిర్ మాస్క్: నిమ్మకాయలు,పెరుగు తినడానికి మాత్రమే కాదు, చర్మ, జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రెండు ఆహారాలు జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి సహాయ పడతాయి. చుండ్రు కూడా పోగొట్టే లక్షణం వీటికి ఉంటుంది. నిమ్మ – పెరుగుతో హెయిర్ మాస్క్ ఎలా తయారు చేస్తారంటే.. ముందుగా ఒక గిన్నెలో కొంత పెరుగు తీసుకుని దానికి నిమ్మరసం జోడించి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు మూలాలకు అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చెయ్యాలి. ఈ హెయిర్ మాస్క్‌ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

మెంతులుతో హెయిర్ మాస్క్: ప్రతి ఇంటి వంటగదిలో మెంతి గింజలు కనిపిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మాత్రమేకాకుండా జుట్టుకు కూడా మంచిపోషణనిస్తాయి. కొద్దిగా నీళ్లలో రాత్రంతా మెంతి గింజలను నానబెట్టి ఉదయం మిక్సర్‌లో తిప్పి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను జుట్టుకు పట్టించి సున్నితంగా మసాజ్ చేసుకోవాలి. ఆరిన తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. దీనిలోని యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చుండ్రును తగ్గించి జుట్టును బలంగా, మెరిసేలా చేస్తాయి.

ఇవి కూడా చదవండి

వేప ఆకులుతో హెయిర్ మాస్క్: వేప ఆకుల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. వేప ఆకులకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. వేప ఆకులను పేస్ట్ లా చేసి మీ జుట్టుకు అప్లై చేయండి. కాసేపటి తర్వాత జుట్టును షాంపుతో శుభ్రం చేసుకోవచ్చు. ఈ రెమెడీని వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.