SSC Recruitment 2022: చివరి అవకాశం! 4300 ఎస్సై, సీఏపీఎఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఇక 2 రోజులే గడువు..

భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission).. 4300ల సబ్‌-ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్డ్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పోస్టుల (SI & CAPF Posts)కు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు..

SSC Recruitment 2022: చివరి అవకాశం! 4300 ఎస్సై, సీఏపీఎఫ్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? ఇక 2 రోజులే గడువు..
Ssc Si, Capf Jobs
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 4:21 PM

SSC SI, CAPF Recruitment 2022: భారత ప్రభుత్వ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ విభాగానికి చెందిన న్యూఢిల్లీలోని స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (Staff Selection Commission).. 4300ల సబ్‌-ఇన్‌స్పెక్టర్‌, సెంట్రల్‌ ఆర్డ్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌ పోస్టుల (SI & CAPF Posts) భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి తుది గడువు సమీపిస్తోంది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఆగస్ట్‌ 30, 2022వ తేదీ రాత్రి 11 గంటల 30 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. 25 యేళ్లలోపు వయసున్న యువతీ, యువకులు ఈ పోస్టులకు అర్హులు. అలాగే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా శారీరక కొలతలు కూడా ఉండాలి. ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్ సర్వీస్‌ మెన్‌ మినహా మిగతావారు రూ.100లు దరఖాస్తు రుసుము తప్పనిసరిగా చెల్లించాలి. రాత పరీక్ష, ఫిజికల్ టెస్ట్‌, మెడికల్ స్టాండర్డ్‌ టెస్టుల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. అర్హత సాధించిన వారికి పోస్టును బట్టి నెలకు రూ.35,400ల నుంచి రూ.1,12,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఖాళీల వివరాలు:

  • ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు (పురుషులు): 228
  • ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు (మహిళలు): 112
  • సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF)లో సబ్-ఇన్‌స్పెక్టర్ (GD) పోస్టులు: 3960

ముఖ్యమైన తేదీలు..

ఇవి కూడా చదవండి
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్ట్‌ 30, 2022.
  • ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: ఆగస్ట్‌ 31, 2022.
  • అప్లికేషన్‌లో తప్పుల సవరణకు తుది తేదీ: సెప్టెంబర్‌ 1, 2022.
  • ఆన్‌లైన్‌ రాత పరీక్ష తేదీ: నవంబర్‌, 2022.

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు