NIFT Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్‌ ‘సీ’ ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..

న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) హరియాణా రాష్ట్రంలోని పంచకులలో.. రెగ్యులర్ ప్రాతిపదికన 11 మెషిన్ మెకానిక్, అసిస్టెంట్(ఫైనాన్స్ & అకౌంట్స్) తదితర..

NIFT Recruitment 2022: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో గ్రూప్‌ 'సీ' ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..
Nift
Follow us
Srilakshmi C

|

Updated on: Aug 28, 2022 | 3:51 PM

NIFT Group-‘C’ Recruitment 2022: న్యూఢిల్లీ కేంద్రంగా ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ) హరియాణా రాష్ట్రంలోని పంచకులలో.. రెగ్యులర్ ప్రాతిపదికన 11 మెషిన్ మెకానిక్, అసిస్టెంట్(ఫైనాన్స్ & అకౌంట్స్), అసిస్టెంట్ వార్డెన్ (మహిళ), స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3, నర్స్‌, లైబ్రరీ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల (Machine Mechanic Posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీ/షార్ట్‌హ్యాండ్ సర్టిఫికేట్/ఐటీఐ/డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు 27 యేళ్లకు మించకుండా ఉండాలి.

ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆఫ్‌లైన్‌ విధానంలో సెస్టెంబర్‌ 19, 2022వ తేదీలోపు కింది అడ్రస్‌కు పోస్టు ద్వారా అప్లికేషన్లను పంపించాలి. దరఖాస్తు సమయంలో జనరల్‌ అభ్యర్ధులు రూ.590లు అప్లికేషన్‌ ఫీజుగా చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/మహిళలు/ఇప్పటికే నిఫ్ట్‌లో ఉద్యోగులుగా కొనసాగుతున్నవారికి దరఖాస్తు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది. రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపికైన వారికి 7వ పే స్కూల్‌ ఆధారంగా జీతభత్యాలు చెల్లిస్తారు.

అడ్రస్‌: The Director, National Institute of Fashion Technology (NIFT), NIFT Campus, Sector 23, Panchkula, Haryana -134116.

ఇవి కూడా చదవండి

ఇతర పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.