AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare Mistakes: నీళ్లతో ముఖం కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటున్నారా..? ఐతే మీరిది తెలుసుకోవాల్సిందే..

మచ్చలేని మోము కోసం మగువలు ఎన్నో సౌందర్య ఉత్వత్తులు వినియోగిస్తుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లో రసాయనాలు వినియోగిస్తే అసలు సమస్య పోయాక కొత్త సమస్య ప్రారంభమవుతుంది. ఇంట్లోనే అందం సంరక్షణకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మచ్చలేని ముఖారవిందం మీ సొంతం అవుతుంది. అవేంటో తెలుసుకుందాం..

Skincare Mistakes: నీళ్లతో ముఖం కడుక్కుని టవల్‌తో తుడుచుకుంటున్నారా..? ఐతే మీరిది తెలుసుకోవాల్సిందే..
Skincare Mistakes
Srilakshmi C
|

Updated on: Sep 02, 2023 | 12:51 PM

Share

మచ్చలేని మోము కోసం మగువలు ఎన్నో సౌందర్య ఉత్వత్తులు వినియోగిస్తుంటారు. మార్కెట్లో దొరికే ఉత్పత్తుల్లో రసాయనాలు వినియోగిస్తే అసలు సమస్య పోయాక కొత్త సమస్య ప్రారంభమవుతుంది. ఇంట్లోనే అందం సంరక్షణకు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మచ్చలేని ముఖారవిందం మీ సొంతం అవుతుంది. అవేంటో తెలుసుకుందాం..

చర్మతత్వాన్ని బట్టి సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోవాలి

మీ చర్మం తత్వాన్ని బట్టి సౌందర్య ఉత్పత్తులను ఎంచుకోవాలి. కొత్త రకం కాస్మటిక్స్ ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. చేతికి లేదా మరేదైనా ప్రదేశంలో వినియోగించిన తర్వాత అలెర్జీ లేదని నిర్ధారించుకున్న తర్వాతనే వినియోగించాలి.

ముఖానికి క్రీమ్ రాసుకునే ముందు చేతులు శుభ్రం చేసుకోవాలి

చాలా మంది చేతులతో ముఖానికి క్రీమ్, పౌడర్ వంటివి పూసుకుంటుంటారు. అయితే ఇలా చేస్తే మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా ముఖంపైకి చేరవచ్చు. కాబట్టి నేరుగా చేతులతో క్రీమ్ వినియోగించడానికి బదులు చేతులు శుభ్రంగా కడుగుకోవాలి.

ఇవి కూడా చదవండి

తగినన్ని నీళ్లు తాగాలి

చర్మం ఆరోగ్యంగా ఉండటానికి పుష్కలంగా నీళ్లు తాగడం చాలా అవసరం. కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటివి తగినంత క్రమం తప్పకుండా తాగుతుండాలి.

రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ తప్పనిసరి

కొంతమంది రాత్రి పడుకున్నప్పుడు మేకప్‌ని తొలగించకుండా అలాగే పడకమీద నిద్రిస్తుంటారు. ఇలా చేయడం వల్ల మేకప్ రాత్రంతా చర్మంపై ఉంటుంది. ఇది చర్మానికి కూడా హాని కలిగిస్తుంది. ఇది చర్మం రంధ్రాలు మూసుకుపోయేలా చేస్తుంది. అందుకే రాత్రి పడుకునే ముందు మేకప్ తీసేసి ముఖం శుభ్రంగా కడుక్కోవాలి.

టవల్ తో ముఖాన్ని తుడుచుకోవడం

మహిళలతోపాటు పురుషులు కూడా ముఖం నీళ్లతో శుభ్రం చేసుకున్న తర్వాత తువ్వాలతో ముఖాన్ని తుడుచుకుంటారు. ఐతే తువ్వాలుతో ముఖం తుడుచుకోవడానికి ముందే అది శుభ్రంగా ఉతికినదో కాదో నిర్ధారించుకోవాలి. అపరిశుభ్రంగా ఉన్న తువ్వాలు వాడితే ముఖంపై బ్యాక్టీరియా ఏర్పడుతుంది. కాబట్టి ముఖాన్ని తుడవడానికి శుభ్రంగా ఉతికిన టవల్ మాత్రమే ఉపయోగించాలి.

నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్ చేయండి.