Facial Mists: మార్కెట్ లో సందడి చేస్తున్న ఫేషియల్ మిస్ట్స్.. చర్మానికి ఎలా ఉపయోగపయోగించాలంటే

ఫేషియల్ మిస్ట్ సహాయంతో పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజు ఉపయోగించే స్కిన్ కేర్ వస్తువుల్లో ఫేషియల్ మిస్ట్‌ని చేర్చుకోవచ్చు. దీనిని ఉపయోగించి చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఫేషియల్ మిస్ట్ అంటే ఏమిటి? అది చర్మానికి ఎలా మేలు చేస్తుందో నిపుణుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం?

Facial Mists: మార్కెట్ లో సందడి చేస్తున్న ఫేషియల్ మిస్ట్స్.. చర్మానికి ఎలా ఉపయోగపయోగించాలంటే
Facial Mists
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2024 | 7:04 PM

చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉండాలంటే.. అందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. చర్మం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. అయితే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా వాడే అలవాటు లేని వారు స్కిన్ మిస్ట్ వాడవచ్చు. దీంతో చర్మం పూర్తిగా హైడ్రేటెడ్ గా ఉంటుంది.

సిట్టా CEO సహ వ్యవస్థాపకురాలు, చర్మ నిపుణురాలు ఆకాంక్ష శర్మ మాట్లాడుతూ స్త్రీలతో పాటు పురుషులకు కూడా ఫేషియల్ మిస్ట్ తప్పనిసరి అని చెప్పారు. దీని సహాయంతో పొడి చర్మం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. రోజు ఉపయోగించే స్కిన్ కేర్ వస్తువుల్లో ఫేషియల్ మిస్ట్‌ని చేర్చుకోవచ్చు. దీనిని ఉపయోగించి చర్మాన్ని మెరిసేలా చేసుకోవచ్చు. ఫేషియల్ మిస్ట్ అంటే ఏమిటి? అది చర్మానికి ఎలా మేలు చేస్తుందో నిపుణుల చెప్పిన విషయాలు తెలుసుకుందాం?

ఫేస్ మిస్ట్ అంటే ఏమిటి?

ఫేస్ మిస్ట్ అనేది ఒక రకమైన స్ప్రే అని స్కిన్ ఎక్స్‌పర్ట్ ఆకాంక్ష శర్మ చెప్పారు. ఇది మూలికలు, విటమిన్లు, వివిధ సహజ పదార్ధాలను ఉపయోగించి తయారు చేస్తారు. పొడి చర్మం నుండి జిడ్డు చర్మం వరకు అన్ని రకాల చర్మాలకు ఫేస్ మిస్ట్ మంచిది. మార్కెట్‌లో చాలా రకాల ఫేస్ మిస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఫేస్ మిస్ట్ ని రోజ్ వాటర్‌తో కూడా తయారు చేసుకోవచ్చు. దీని ప్రయోజనాలు ఏమిటంటే

ఇవి కూడా చదవండి

చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది

ఫేషియల్ మిస్ట్స్ .. వీటి హైడ్రేటింగ్ లక్షణాలతో ప్రసిద్ధి చెందాయి. స్కిన్ క్రీమ్ లేదా ఆయిల్ కంటే తేలికగా ఉండటం దీని ప్రత్యేకత. పొడి చర్మం ఉన్నవారికి ఫేషియల్ మిస్ట్స్ చాలా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. ఫేషియల్ మిస్ట్ ను రోజుకు రెండు సార్లు ఉపయోగించవచ్చు.

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి

గులాబీ, కలబందతో చేసిన ఫేస్ మిస్ట్ చర్మానికి చాలా మేలు చేస్తుంది. కలబంద స్కిన్ కేర్ కి సంబంధించిన లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. చర్మాన్ని కాలుష్యం నుండి రక్షిస్తుంది. అంతేకాదు ఈ ఫేస్ మిస్ట్ ముఖం ఎరుపు, చికాకు, వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.

యాంటీ ఏజింగ్ లక్షణాలు

ఫేషియల్ మిస్ట్ ను రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల చర్మం యవ్వనంగా ఉంచడంలో సహాయపడుతుంది. చర్మ రంధ్రాలను బిగించి, ముడతలను తగ్గించేందుకు చాలా రకాల ఫేస్ మిస్ట్ లను ప్రత్యేకంగా తయారు చేస్తున్నారు. అటువంటి పరిస్థితిలో ముడతలు, ఫైన్ లైన్లకు సంబంధించిన సమస్య ఉంటే ఈ ఫేస్ మిస్ట్ ని ఉపయోగించవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.