Pregnancy: గర్భిణీలు వంకాయ తింటే ప్రమాదమా.? అసలు విషయం ఏంటంటే..

అలాగే ఆహారం విషయంలో గర్భిణీలకు ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటి వాటిలో వంకాయ ఒకటి. వంకాయ తీసుకోవడం వల్ల గర్భిణీలకు ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. గర్భిణీలుగా ఉన్న సమయంలో వంకాయ తింటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయని, శరీరంలో నొప్పులు, వాపులు పెరుగుతాయని కొంతమందిలో ఓ అపోహ ఉంది...

Pregnancy: గర్భిణీలు వంకాయ తింటే ప్రమాదమా.? అసలు విషయం ఏంటంటే..
Pregnancy
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 07, 2024 | 6:53 PM

మహిళల్లో గర్భధారణ సమయం ఎంతో కీలకమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ సమయంలో మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతుంటారు. తీసుకునే ఆహారం మొదలు, జీవనశైలి వరకు అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తుంటారు. తీసుకునే ప్రతీ ఆహారం విషయంలో వెనకా ముందు ఆలోచిస్తుంటారు. ఏది తిన్నాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటారు.

అలాగే ఆహారం విషయంలో గర్భిణీలకు ఎన్నో అపోహలు ఉంటాయి. అలాంటి వాటిలో వంకాయ ఒకటి. వంకాయ తీసుకోవడం వల్ల గర్భిణీలకు ప్రమాదకరమని చాలా మంది భావిస్తుంటారు. గర్భిణీలుగా ఉన్న సమయంలో వంకాయ తింటే కాళ్లు, చేతులు తిమ్మిర్లు వస్తాయని, శరీరంలో నొప్పులు, వాపులు పెరుగుతాయని కొంతమందిలో ఓ అపోహ ఉంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. నిజానికి వంకాయ తీసుకోవడం వల్ల గర్భిణీలకు మేలు జరుగుతుందని అంటున్నారు.

ఇంతకీ వంకాయతో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడ తెలుసుకుందాం. వంకాయలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో తినడంవల్ల తల్లీ బిడ్డల ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు. కడుపులో పిండం ఎదుగుదలకు, బిడ్డలో మెదడు అభివృద్ధికి వంకాయ మేలు చేస్తుందని అంటున్నారు. నరాల బలహీనత సమస్యలకు చెక్‌ పెడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

వంకాయలో విటమిన్‌ కె, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎలక్ట్రోలైట్లను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని విటమిన్‌ కె అధిక రక్త స్రావాన్ని నివారించడంలో ఉపయోగపడుతుంది. డెలివరీ సమయంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇక వంకాయలో ఫైబర్‌ కంటెంట్‌ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సాధారణంగా ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే గ్యాస్‌, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

ఇక గర్భం దాల్చిన సమయంలో సహజంగానే బరువు పెరుగుతుంటారు. అయితే వంకాయలోని ఫైబర్ అధిక బరువును కంట్రోల్ చేస్తుంది. ఇక ప్రెగ్నెన్సీ సమయంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్ట్రెస్‌తో పాటు ఇన్‌ఫ్లమేటరీ సమస్యలకు చెక్‌ పెడుతుంది. ఇందులోని బయోఫ్లేవనాయిడ్స్, రిబోఫ్లేవిన్ సమ్మేళనాలు హైబీపీని కంట్రోల్ చేస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..