AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunita Williams: సునీతా లేకుండా భూమికి తిరిగి వచ్చిన స్టార్‌లైనర్.. ఎక్కడ ల్యాండ్ అయిందంటే

నాసా చెప్పిన ప్రకారం స్టార్‌లైనర్ అంతరిక్ష కేంద్రం నుండి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు విడిపోయి అమెరికాలోని న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్‌లో ఉదయం 9:32 గంటలకు ల్యాండ్ అయింది. ఇది ఎడారి ప్రాంతం. స్టార్‌లైనర్ ల్యాండింగ్ వీడియోలో ల్యాండింగ్‌కు ముందు స్పేస్‌క్రాఫ్ట్ కి సంబంధించిన 3 పారాచూట్‌లు తెరవబడి.. అది భూమిపై సురక్షితంగా దిగగలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

Sunita Williams:  సునీతా లేకుండా భూమికి తిరిగి వచ్చిన స్టార్‌లైనర్.. ఎక్కడ ల్యాండ్ అయిందంటే
sunita williamsImage Credit source: AFP
Surya Kala
|

Updated on: Sep 07, 2024 | 4:13 PM

Share

సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్‌లను అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లిన అంతరిక్ష నౌక స్టార్‌లైనర్ భూమికి తిరిగి వచ్చింది.ఈ అంతరిక్ష నౌక భారత కాలమానం ప్రకారం ఉదయం 9:30 గంటలకు న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్‌లో దిగింది. ఈ వ్యోమనౌక ద్వారా అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ ఇప్పుడు అంతరిక్షంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు వ్యోమగాములు NASAకి చెందిన క్రూ 9 మిషన్‌లో భాగం.. SpaceX డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ఫిబ్రవరి 2025 నాటికి భూమికి తిరిగి వస్తారు.

జూన్ 5న స్టార్‌లైనర్ ఇద్దరు వ్యోమగాములతో అంతరిక్ష కేంద్రానికి చేరుకుంది. అయితే దీనిలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా అది సమయానికి తిరిగి రాలేకపోయింది. స్టార్‌లైనర్‌ను తయారు చేసిన నాసా.. బోయింగ్‌ని పంపి దానితో పాటు స్టార్‌లైనర్ నుంచి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్‌లను తిరిగి తీసుకురావాలని మొదట అనుకుంది. అయితే బోయింగ్ వ్యోమనౌకను సురక్షితంగా తిరిగి తీసుకుని రాగలదని నమ్మకంగా ఉన్నప్పటికీ.. దీని ద్వారా వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రావడాన్ని ‘ప్రమాదకరం’గా పరిగణించింది. చివరగా..మూడు నెలల తర్వాత బోయింగ్ సాయంతో స్టార్‌లైనర్ భూమిపై సురక్షితంగా ల్యాండ్ చేయడంలో విజయవంతమైంది.

ఇవి కూడా చదవండి

నాసా చెప్పిన ప్రకారం స్టార్‌లైనర్ అంతరిక్ష కేంద్రం నుండి భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3:30 గంటలకు విడిపోయి అమెరికాలోని న్యూ మెక్సికోలోని వైట్ శాండ్ స్పేస్ హార్బర్‌లో ఉదయం 9:32 గంటలకు ల్యాండ్ అయింది. ఇది ఎడారి ప్రాంతం. స్టార్‌లైనర్ ల్యాండింగ్ వీడియోలో ల్యాండింగ్‌కు ముందు స్పేస్‌క్రాఫ్ట్ కి సంబంధించిన 3 పారాచూట్‌లు తెరవబడి.. అది భూమిపై సురక్షితంగా దిగగలిగినట్లు స్పష్టంగా తెలుస్తోంది.

సునీతా విలియమ్స్ అంతరిక్షం నుండి ఎప్పుడు, ఎలా తిరిగి వస్తారు?

స్టార్‌లైనర్ జూన్ 5న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్‌లతో కలిసి అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. ఈ ఇద్దరు వ్యోమగాములు జూన్ 13న తిరిగి రావాల్సి ఉంది. ఇది స్టార్‌లైనర్ మొదటి టెస్ట్ ఫ్లైట్.. అయితే థ్రస్టర్ వైఫల్యంతో పాటు హీలియం లీకేజీ కారణంగా అది సమయానికి తిరిగి రాలేకపోయింది. 8 రోజుల టెస్ట్ మిషన్‌పై అంతరిక్షంలోకి వెళ్లిన విలియమ్స్, విల్మోర్ తిరిగి రావడానికి చాలా కాలం వేచి ఉండాల్సి వస్తుందని ఇప్పటికే నాసా ప్రకటించింది. నాసా తన క్రూ 9 మిషన్‌లో ఇద్దరు వ్యోమగాములను ఒక భాగంగా చేసింది. దీని కారణంగా ఇప్పుడు వారిద్దరూ ఫిబ్రవరి 2025 నాటికి భూమి మీదకు తిరిగి వస్తారు.

నాసా క్రూ 9 మిషన్ ద్వారా మొదట 4 వ్యోమగాములను ప్రయోగించాలని భావించింది. అయితే కొద్ది రోజుల క్రితం తమ నిర్ణయంలో మార్పు గురించి సమాచారం ఇస్తూ.. స్పేస్‌ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్, అంతరిక్ష కేంద్రంలో ఉన్న సునీతా విలియమ్స్ , బుచ్ విల్మోర్ ఇందులో భాగం అవుతారని వెల్లడించింది. దీంతో క్రూ 9 మిషన్ ద్వారా ఇద్దరే వ్యోమగాములను ప్రయోగించనున్నట్లు నాసా తెలిపింది. ఈ నెలాఖరులోగా నాసా క్రూ 9 మిషన్‌ను ప్రారంభించనుంది.

8 రోజుల మిషన్ 8 నెలలుగా మారింది!

సునీతా విలియమ్స్ 1965 సంవత్సరంలో అమెరికాలో జన్మించారు. ఆమె తండ్రి దీపక్ పాండ్యా భారతీయుడు.1958లో గుజరాత్ నుండి అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. 1998లో నాసాలో సునీతా విలియమ్స్‌ వ్యోమగామిగా ఎంపిక అయింది. అప్పటి నుండి ఆమె చాలాసార్లు అంతరిక్ష యాత్రలకు వెళ్లారు.

సునీతా విలియమ్స్ గతంలో 2006, 2012లో అంతరిక్షయానం చేశారు. నాసా చెప్పిన ప్రకారం సునీతా ఇప్పటి వరకూ మొత్తం 322 రోజులు అంతరిక్షంలో గడిపింది. ఈసారి సునీత వెళ్ళిన మిషన్ 8 రోజులు మాత్రమే అయినప్పటికీ.. స్టార్‌లైనర్‌లోని సాంకేతిక లోపం వలన ఈ 8 రోజుల మిషన్‌ 8 నెలలుగా మారింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు