Nepal Controversy: నేపాల్ కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్.. కొత్త పంచాయతీ.!
భారత్‌తో ఉన్న భూవివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసింది. వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌లను కూడా జత చేసింది. నేపాల్ ప్రధాని దహల్ మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్‌తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది.
భారత్‌తో ఉన్న భూవివాదాన్ని నేపాల్ సెంట్రల్ బ్యాంక్ మరింత రాజేసింది. వివాదాస్పద భూభాగాలుగా ఉన్న లిపులేక్, కాలాపానీ, లింపియాదూర ప్రాంతాలను తమవిగా చెప్పుకుంది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ ముద్రించే కరెన్సీ నోట్లపై భారత భూభాగాల మ్యాప్‌లను కూడా జత చేసింది. నేపాల్ ప్రధాని దహల్ మంత్రివర్గం ఈ వివాదాస్పద మ్యాప్‌తో నోట్లను ముద్రించాలని మే 3వ తేదీన నిర్ణయించింది. లిపులేక్, కాలాపానీ, లింపియాదురా ప్రాంతాలను తమ భూభాగాలుగా చెబుతూ నేపాల్ 2020లోనే సరికొత్త మ్యాప్‌లను విడుదల చేసింది. నాటి కేపీ శర్మ వోలీ ప్రభుత్వం ఈ మేరకు తీర్మానం చేసింది. దీనికి అప్పట్లో నేపాల్ పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. భారత్ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ ఆ దేశం అధికారిక పత్రాల్లో వాడే మ్యాప్‌లను సరికొత్త మ్యాప్‌లతో భర్తీ చేశారు.
అయితే ఈ ప్రాంతాలు తమకు చెందినవేనని భారత్ చెబుతోంది. 1879లో బ్రిటిష్ ఇండియా అధికారులు రూపొందించిన మ్యాప్ మేరకు కాలాపానీ మొత్తం ప్రదేశం భారత్‌లోనే ఉంది. తాము కొత్తగా ఒక అంగుళం భూమిని కూడా ఆక్రమించుకోలేదని భారత్ గతంలోనే స్పష్టం చేసింది. కాలాపానీతో పాటు లిపులేఖ్ కనుమదారి కూడా తమ ప్రాంతమేనని నేపాల్ వాదిస్తోంది. అయితే 1830 నుంచి ఈ ప్రాంతం తమ అధీనంలో ఉందని భారత్ చెబుతోంది. భారత భూభాగాలతో కూడిన కొత్త మ్యాప్‌లను నేపాల్ విడుదల చేసినంత మాత్రాన వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..

