AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi: హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు.. ఎక్కడంటే

ముస్లిం అయితేనేం.. మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచాడు. వినాయక వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాడు. పేరు మహ్మద్ ఇషాక్. ఊరు అక్కయ్యపాలెంలోని చిన్నూరు. శుక్రవారం కావడంతో నమాజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే.. ఏకంగా ఓ టెంపో ను వెంటపెట్టుకొని వచ్చి.. వాటి నిండా వినాయక విగ్రహాలు నింపుకుని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సెంటర్కు చేరుకున్నాడు. చవితి సందర్భంగా.. హిందూ సోదరులందరికీ వినాయక ప్రతిమలను పంపిణీ చేశాడు.

Vinayaka Chavithi: హిందూ సోదరులకు మట్టి వినాయకులను పంపిణీ చేసిన ముస్లిం యువకుడు.. ఎక్కడంటే
Muslim Man Distribute Clay Ganesh Idols
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Sep 07, 2024 | 3:09 PM

Share

అత్యంత రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు.. చవితి పూజల సామగ్రి కొనే హడావిడిలో ఉన్నారు చాలామంది.. మరికొందరు బిజీబిజీగా వెళ్తూ ఉన్నారు. అక్కడ ఓ యువకుడు తలపై టోపీ కుర్తా పైజామా వేసుకుని కనిపించాడు. మహిళలు వృద్ధులు, విద్యార్థులు అతని దగ్గర క్యూకట్టారు.. షేక్ హ్యాండ్ ఇస్తూ అభినందిస్తున్నారు. కొందరైతే చల్లగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు.. ఎందుకో తెలుసా..? వినాయక చవితి సందర్భంగా…

అతడు ముస్లిం అయితేనేం.. మతసామరస్యానికి సోదర భావానికి ప్రతీకగా నిలిచాడు. వినాయక వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నాడు. పేరు మహ్మద్ ఇషాక్. ఊరు అక్కయ్యపాలెంలోని చిన్నూరు. శుక్రవారం కావడంతో నమాజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే.. ఏకంగా ఓ టెంపో ను వెంటపెట్టుకొని వచ్చి.. వాటి నిండా వినాయక విగ్రహాలు నింపుకుని అక్కయ్యపాలెం 80 ఫీట్ రోడ్ సెంటర్కు చేరుకున్నాడు. చవితి సందర్భంగా.. హిందూ సోదరులందరికీ వినాయక ప్రతిమలను పంపిణీ చేశాడు. ఏకంగా వెయ్యి విగ్రహాలను తీసుకొచ్చి పంచాడు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాడు. అంతేకాదు.. మట్టి వినాయకులనే పూజిద్దాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం అంటూ.. పిలుపునిచ్చాడు ఆ యువకుడు.

ఇవి కూడా చదవండి

దీంతో.. ఇషాక్ పంచిన వినాయక మట్టి విగ్రహాలను తీసుకోవడానికి క్యూ కట్టారు జనం. వాహనాలను ఆపి.. ఇషాక్ చేతుల మీదుగా మట్టి వినాయక విగ్రహాన్ని తీసుకొని.. ఆపై అతనికి అభినందించకుండా ఉండలేకపోయారు. అంతటితో ఆగకుండా.. అతనితో ఓ సెల్ఫీ తీసుకొని వెళ్లారు. పిల్లలు పెద్దలు మహిళలు వృద్ధులు, విద్యార్థులు అనే తేడా లేకుండా.. ఆ ముస్లిం యువకుడిని చూసిన వారంతా అతని వద్దకు వెళ్లి వినాయకుడి ప్రతిమలను అందుకున్నారు. ప్రశంసించి శభాష్ సోదరా అంటూ భుజం తట్టారు.

ఓ ముస్లిం యువకుడు హిందూ సోదరుల కోసం మట్టి వినాయకులను పంపిణీ చేస్తే.. అతనికి ప్రోత్సహించకుండా, అభినందించకుండా ఉండలేము కదా అని అంటున్నారు అక్కడ విగ్రహాలను తీసుకున్న వాళ్లంతా. ఇది కదా నిజమైన మతసామరస్యం అంటే.. అంటూ ప్రశంసిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..