AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayaka Chavithi 2024: ఇష్టదైవానికి అనంత్ అంబానీ అదిరిపోయే కానుక .. 20 కేజీల బంగారంతో..

ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖదర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈసారి లాల్‌బాగ్ రాజు మొదటి చిత్రం బయటకు వచ్చింది. ఈసారి ఎక్కడ గణపయ్య కిరీటం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. లాల్‌బాగ్ రాజా కిరీటం రూ.16 కోట్లతో తయారైంది.

Vinayaka Chavithi 2024: ఇష్టదైవానికి అనంత్ అంబానీ అదిరిపోయే కానుక .. 20 కేజీల బంగారంతో..
Lalbagh Ganesh2024
Surya Kala
|

Updated on: Sep 06, 2024 | 7:52 PM

Share

దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. గణపతి ఉత్సవాలు జరుపుకోవడానికి ఊరూవాడా సిద్దం అవుతుంది. దేశ వ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుకుంటున్నప్పటికీ.. మహారాష్ట్రలో మాత్రం వినాయక చవితి పండుగకి పెట్టింది పేరు. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలను చాలా ప్రత్యేకంగా జరుపుకోవడం తెలిసిందే. అయితే ఐకానిక్ లాల్‌బాగ్చా రాజా వినాయక ఉత్సవం మాత్రం వెరీ వెరీ స్పెషల్. ఇక్కడికి గణపయ్య ముఖదర్శనం చేసుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈసారి లాల్‌బాగ్ రాజు మొదటి చిత్రం బయటకు వచ్చింది. ఈసారి ఎక్కడ గణపయ్య కిరీటం సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారింది. లాల్‌బాగ్ రాజా కిరీటం రూ.16 కోట్లతో తయారైంది.

పెళ్లి జరిగిన తర్వాత వచ్చిన మొదటి పండగ వినాయక చవితి.. ఈ సందర్భంగా లాల్‌బాగ్ రాజా వినాయకుడికి అనంత్ అంబానీ 20 కేజీల బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చాడు. కోట్ల విలువ జేసే ఈ కిరీటాన్ని దాదాపు 2 నెలల కష్టపడి తయారు చేసినట్లు ఆలయ కమిటీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

ఈ ఏడాది గణేశోత్సవం సెప్టెంబర్ 7వ తేదీ నుంచి ప్రారంభం కానుండడంతో ఇక్కడ సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి. పండల్‌ను (మండపాన్ని) అందంగా అలంకరించారు. వినాయక విగ్రహం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు. విఘ్నాలకధిపతి గణపతి చేతిలో చక్రం, నుదుటిపై త్రిశూల తిలకం ధరించిన భక్తులను మంత్రముగ్ధులను చేసేందుకు రెడీ అయ్యాడు. బంగారు ఆభరణాలతో అలంకరించడంతో మిలమిలా మెరుస్తున్నాడు.

మస్లిన్ దుస్తులలో బప్పా అద్భుతమైన దృశ్యం

లాల్‌బాగ్ రాజ వినాయకుడు మెరూన్ కలర్ మస్లిన్ దుస్తులు ధరించాడు. మూడు రంగులలో తయారు చేసిన పువ్వుల మాల ధరించాడు. అందంగా ఆకర్షణీయంగా బొజ్జ గణపయ్య దివ్య రూపం కనుల విందు చేస్తుంది.

సెలబ్రిటీలు సైతం క్యూలు

లాల్‌బాగ్ రాజు వినాయకుడి ఉత్సవాలు చూసేందుకు సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రేటీలు సైతం క్యూలు కడతారు. దేశవిదేశాలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు, వివిఐపీలు కూడా వినాయకుడిని దర్శించుకుంటారు. అందులో ముకేష్ అంబానీ కుటుంబం కూడా ఒకటి.

ఉచితంగా సేవలు అందిస్తున్న అగ్నిమాపక సిబ్బంది

లాల్‌బాగ్ రాజా కోసం ఈ సంవత్సరం అగ్నిమాపక దళం కూడా బోర్డుకు తన సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. లైబ్రరీలు, ఆసుపత్రులకు కోట్లాది రూపాయల విరాళం అందజేయడమే కాదు అనేక సామాజిక కార్యక్రమాలు లాల్‌బాగ్ రాజా ద్వారా కూడా జరుగుతాయన్న సంగతి తెలిసిందే.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
డీమార్ట్‌లో పనిచేసేవారికి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా..? సూపర్బ్..
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
చీర కొనివ్వలేదని.. భర్తను కుక్కర్‌తో కొట్టి చంపిన భార్య!
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
ఆకుపచ్చగా మారిన బంగాళాదుంపలు తినాలా? పారేయాలా? 99% మందికి తెలియదు
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సిమెంట్ రోడ్డు.. తారు రోడ్డు.. ఏది బెస్ట్? తేడా ఏంటి?
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
సీఎస్‌కే ఆటగాళ్లపై కన్నేసిన ఆర్సీబీ.. కానీ డీల్ కుదర్లేదు
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
చూడనీకి రెండు కళ్లు చాలవు.. పసుపు కొమ్ముల రూపంలో జగజ్జనని
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
అలర్ట్.. మీరు కూడా నోట్లో బ్యాటరీలు పెట్టుకుంటారా..?
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒక్క టచ్‌తో ఆటోమేటిక్‌గా యూపీఐ పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే..
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!
ఒకే ఓటీటీలో 60 సినిమాలు.. ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండదు!