AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vinayak Chavithi 2024: వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు..? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రీజన్ ఏమిటంటే

వినాయక చవితి పాటించే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. ఇలా చవితికి పాలవెల్లిని కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి.. మామిడి ఆకులూ, కలువ పువ్వులతో అలంకరించి మొక్క జొన్న పొత్తులు, బత్తాయి, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లని కడతారు. అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే..

Vinayak Chavithi 2024: వినాయక చవితికి పాలవెల్లి ఎందుకు కడతారు..? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రీజన్ ఏమిటంటే
Paalavelli
Surya Kala
|

Updated on: Sep 06, 2024 | 6:40 PM

Share

వినాయక చవితి వస్తుందంటే చాలు వారం రోజుల ముందు నుంచే హడావిడి మొదలవుతుంది. వినాయక విగ్రహం తయారీ దగ్గర నుంచి పూజ కోసం పత్రి, పువ్వులు వంటివి సేకరణ వంటివి పిల్లలు ఎంతో భక్తి శ్రద్దలతో చేస్తారు. అయితే వినాయక చవితి పండగను వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా జరుపుకుంటారు. కొంతమంది వినాయక చవితికి పాలవెల్లిని కడతారు. ఇలా వినాయక చవితి రోజున పాలవెల్లి కట్టే సాంప్రదాయం ఎందుకో నేటి తరంలో చాలా మందికి తెలియదు. మా ఇంట్లో పెద్దలు కట్టారు.. కనుక మేము కూడా పాలవెల్లిని కడుతున్నాంఅని చెప్పేవారు కూడా ఉన్నారు. ఈ నేపధ్యంలో ఈ రోజు వినాయక చవితికి పాలవెల్లిని ఎందుకు కడతారో తెలుసుకుందాం..

వినాయక చవితి పాటించే ప్రతి ఆచారమూ ఇతర పండుగలకి భిన్నంగానే ఉంటుంది. అందులో ఒకటి పాలవెల్లిని కట్టడం కూడా ఒకటి. పాలవెల్లి లేకపోతే గణపతి పూజ పరిపూర్ణం కాదు. ఇలా చవితికి పాలవెల్లిని కట్టడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. చతురస్రాకారంలో ఉన్న ఒక ఊయల వంటి వస్తువుకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి.. మామిడి ఆకులూ, కలువ పువ్వులతో అలంకరించి మొక్క జొన్న పొత్తులు, బత్తాయి, దానిమ్మ వంటి ఈ సీజన్ లో దొరికే రకరకాల పండ్లని కడతారు. అయితే ఇలా పాలవెల్లిని ఎందుకు కడతారంటే..

గణేశుని పూజ అంటే ప్రకృతి ఆరాధనే కదా.. సృష్టి, స్థితి, లయలకు ప్రతీక గణపతి. అనంత విశ్వంలో భూమి అణువంతే! భూమి మీద నిలబడి పైకి చూస్తే సూర్యుడిని తలదన్నే నక్షత్రాలు కోటానుకోట్లు కనిపిస్తాయి. పాలసముద్రాన్నే తలపిస్తాయి. వీటిని పాలపుంత లేదా పాలవెల్లి అని అంటారు. దానికి చిహ్నంగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. భూమి(సృష్టి)ని సూచిస్తూ మట్టి వినాయకుడు.. జీవానికి (స్థితి) చిహ్నంగా పత్రినీ, ఆకాశానికి (లయం)కి చిహ్నంగా పాలవెల్లిని గణపతి పూజలో పెట్టి ఆరాధిస్తారు.

ఇవి కూడా చదవండి

గణపతి అంటే గణాలకు అధిపతి.. తొలి పూజను అందుకునే దైవం. కనుక గణపతిని పూజించడం అంటే ముక్కోటి దేవతలనూ పూజించడం.. ఆ దేవతలందరికీ సూచనగా పాలవెల్లిని వినాయక చవితికి కడతారు. అంటే పాలవెల్లి సకల దేవతలకూ ప్రతిక. పాలపుంతలో నక్షత్రాలుగా వెలగపండు, మొక్కజొన్నపొత్తులు, మామిడిపిందెలు, జామ, దానిమ్మ వంటి వివిధ రకాల వస్తువులు కడతాము. అవి ప్రకృతికీ చిహ్నం. వినాయకుడు సాక్షాత్తు ఓంకార స్వరూపుడని నమ్మకం. అంతేకాదు ప్రపంచానికి అధిపతి అయిన స్వామికి ఛత్రంగా పాలవెల్లిని కట్టే సాంప్రదాయం ఏర్పడిందట.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..