Tirumala: వడ్డీకాసుల వాడికి ఆగస్ట్ నెలలో కాసుల వర్షం.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిదంటే

ఇటీవల కాలంలో ఘననీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 7 నెలల హుండీ ఆదాయం రూ. 795.35 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది.

Tirumala: వడ్డీకాసుల వాడికి ఆగస్ట్ నెలలో కాసుల వర్షం.. ఈ ఏడాదిలో ఇప్పటి వరకూ ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిదంటే
Tirumala Tirupati
Follow us
Raju M P R

| Edited By: Surya Kala

Updated on: Sep 06, 2024 | 6:09 PM

తిరుమలేశుడి ఆదాయం అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది మొదటి 7 నెలల్లో రూ 795.35 కోట్లకు చేరగా.. తిరుమల వెంకన్న ఆదాయం ఆగస్టు ఒక్క నెలలో రూ 125.67 కోట్లు వచ్చింది. దీంతో తిరుమల శ్రీవారికి 8 నెలల ఆదాయం కాస్తా రూ. 921.02 కోట్లకు చేరుకుంది. ఇటీవల కాలంలో ఘననీయంగా స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హుండీ ఆదాయం కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతోంది. శ్రీవారికి భక్తులు భారీగా కానుకలు సమర్పిస్తూ తిరుమలేశుడి ఆస్తుల విలువను అమాంతంగా పెంచుతున్నారు. వెలకట్టలేని వజ్ర వైడూర్యాలు, బంగారు ఆభరణాలు వెంకన్న సొంతం కాగా ఈ ఏడాది మొదటి 7 నెలల హుండీ ఆదాయం రూ. 795.35 కోట్లుగా శ్రీవారి ఖాతాకు జమైంది. ఈ ఏడాది జనవరిలో రూ 116.46 కోట్లు, ఫిబ్రవరిలో రూ 111.71 కోట్లు, మార్చి నెలలో రూ 118.49 కోట్లు, ఏప్రిల్ నెలలో రూ 101. 63 కోట్లు, మే నెలలో రూ 108.28 కోట్లు, జూన్ నెలలో రూ 113.64 కోట్లు, జులై నెలలో రూ 125.35 కోట్లు, ఆగష్టు నెలలో రూ 125.67 కోట్లు హుండీ కానుకలు శ్రీవారి ఆదాయంగా స్వామివారి ఖాతాకు చేరాయి. ఆగస్టు నెలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తులు, భక్తులు సమర్పించిన కానుకల వివరాలను తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈఓ శ్యామలరావు వెల్లడించారు.

ఆగస్టు నెలలో శ్రీవారిని 22.42 లక్షల మంది భక్తులు దర్శించుకోగా శ్రీవారి హుండీ ఆదాయం రూ. 125.67 కోట్లు వచ్చినట్లు ఈఓ ప్రకటించారు. 1.06 లక్షల లడ్డూలను విక్రయించగా 24.33 లక్షల మంది ఒత్తులు అన్న ప్రసాదం స్వీకరించినట్లు చెప్పారు. ఆగస్టు నెలలో 9.49 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు ప్రకటించారు. ఇక టోకెన్లు లేని భక్తులకు ఆధార్ కార్డు లింక్ చేసి లడ్డూలు ఇవ్వడం వల్ల సాధారణ భక్తులకు మేలు జరుగిందన్నారు శ్యామల రావు. గత వారం రోజుల్లో 75 వేలకు పైగా లడ్డూలను వివిధ దేవాలయాలకు పంపించామని..టీటీడీ అనుబంధ ఆలయాలకు లడ్డూలను నిరంతరంగా పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. శ్రీవారి లడ్డూ నాణ్యత మెరుగు పడుతుందని, స్వామివారి నైవేద్యాల ప్రసాదాలు ఉడికి ఉడకనట్లు ఉన్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయని ఇక నుంచి అది కూడా సరి చేసుకుంటామని తెలిపారు.

సేంద్రియ వ్యవసాయం బియ్యంలో పలు రకాల బియ్యం ఉందని పోటు కార్మికులు తమ దృష్టికి తీసుకొని వచ్చారన్నారు. స్వామివారి నైవేద్యాల ప్రసాదాలపై కమిటీని నియమించామని చెప్పారు. అక్టోబర్ లో జరగనున్న శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
ఫ్రాన్స్ పర్యటనకు ప్రధాని మోదీ..!
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
నటుడిగా 50 ఏళ్ల ప్రస్థానం.. సాయి కుమార్ గురించి ఆసక్తికర విషయాలు
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
'కల్యాణ్ బాబాయికి ఓపిక ఎక్కువ.. దేన్నైనా భరిస్తారు': రామ్ చరణ్
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
ఓర్నీ పాసుగులా.! కోపంతో విమానం డోర్ తెరవబోయాడు.. తీరా చూస్తే..
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
దొంగతనాలలో వాళ్ళ కో ఆర్డినేషన్ చూసి ఖాకీలే షాక్..!
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
ఇలా వైకుంఠగా ముసాబైన తిరుమల.. తెల్లవారుజామునుంచే శ్రీవారి దర్శనం
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
'పొద్దున్నే ముఖంపై ఉమ్మి అప్లై చేస్తా': టాలీవుడ్ క్రేజీ హీరోయిన్
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
లగేజ్‌ స్కాన్ చేస్తుండగా కంగారుపడ్డ వ్యక్తి.. బ్యాగ్ ఓపెన్ చేయగా
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
భక్తులకు భోజనం అందించేందుకు ఇస్కాన్ తో చేతులు కలిపిన అదానీ సంస్థ
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!
సల్మాన్ ఖాన్‌ను టీజ్ చేసిన హర్భజన్-యూవీ!