Onam 2024: ఓనం పండుగ ప్రారంభం.. కేరళ వాసులకు ఈ పండుగ ఎందుకు ప్రత్యేకం? ప్రాముఖ్యత ఏమిటంటే

భూమిని రాక్షసుల నుంచి రక్షించడానికి శ్రీ మహా విష్ణువు వామన అవతారం ఎత్తాడు. బలి చక్రవర్తి నుంచి మూడు ఆడుగుల నేల దానంగా అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి పంపాడు. అయితే విష్ణువుకి మూడో అడుగుగా తన తలని ఇచ్చే ముందు తాను ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చే విధంగా వరాన్ని కోరాడు. విష్ణువు అతని కోరికను అంగీకరించాడు. అప్పటి నుండి బలి చక్రవర్తి ఓనం సమయంలో మాత్రమే భూమిపైకి వస్తాడని నమ్ముతారు.

Onam 2024: ఓనం పండుగ ప్రారంభం.. కేరళ వాసులకు ఈ పండుగ ఎందుకు ప్రత్యేకం? ప్రాముఖ్యత ఏమిటంటే
Onam 2024
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2024 | 3:50 PM

ఓనం పండుగ కేరళలో అతి ముఖ్యమైన పండుగ. ఈ పండగను మలయాళీలు ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగ ప్రతి సంవత్సరం ఆగష్టు లేదా సెప్టెంబర్ మధ్య వస్తుంది. 10 రోజుల పాటు సంప్రదాయంగా జరుపుకునే ఈ పండగ “తిరువోణం” రోజుతో ముగుస్తుంది. ఓనం పండుగ చారిత్రాత్మక, సాంస్కృతిక, మతపరమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇది ప్రధానంగా బలి చక్రవర్తి భూమి మీదకు తిరిగి రావడాన్ని స్వాగతిస్తూ మలయాళీలు జరుపుకుంటారు. ఓనం సందర్భంగా కేరళలో పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

ఓనం ఎందుకు జరుపుకుంటారు?

ఓనం కేరళలో అతిపెద్ద పండుగగా పరిగణించబడుతుంది. ఈ పండుగకు సంబంధించి అనేక పురాణ కథలు ఉన్నాయి. అత్యంత ప్రసిద్ధ కథ బలి చక్రవర్తికి సంబంధించినది. రాక్షస రాజు అయిన బలి చక్రవర్తి చాలా దయగల రాజు అని నమ్ముతారు. భూమిని రాక్షసుల నుంచి రక్షించడానికి శ్రీ మహా విష్ణువు వామన అవతారం ఎత్తాడు. బలి చక్రవర్తి నుంచి మూడు ఆడుగుల నేల దానంగా అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి పంపాడు. అయితే విష్ణువుకి మూడో అడుగుగా తన తలని ఇచ్చే ముందు తాను ప్రతి సంవత్సరం భూమిపైకి వచ్చే విధంగా వరాన్ని కోరాడు. విష్ణువు అతని కోరికను అంగీకరించాడు. అప్పటి నుండి బలి చక్రవర్తి ఓనం సమయంలో మాత్రమే భూమిపైకి వస్తాడని నమ్ముతారు. ఓనం రోజున బలి చక్రవర్తి ఆగమనాన్ని పురస్కరించుకుని మలయాళీ ప్రజలు తమ ఇళ్లను పువ్వులు, తోరణాలు, రంగోలి మొదలైన వాటితో అలంకరిస్తారు. ఈ రోజున ఖీర్, పులిస్సేరి వంటి వివిధ రుచికరమైన వంటకాలను తయారు చేస్తారు. ఈ పండుగ సందర్భంగా కేరళలో కథాకళి నృత్యం, పడవ పందెం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు.

ఓనం సాంస్కృతిక ప్రాముఖ్యత

ఓనం పండగను కేరళ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సౌభ్రాతృత్వానికి, సౌభాగ్యానికి, ఐక్యతకు ప్రతీక. వివిధ కులాలు, మతాల ప్రజలు కలిసి దీనిని జరుపుకుంటారు. ఇది సమాజంలో ఐక్యత, సాంస్కృతిక వైభవాన్ని పెంచుతుంది. ఈ సమయంలో కేరళ ప్రజలు తమ సాంప్రదాయ దుస్తులను ధరిస్తారు. వేడుకను ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగ జీవితం ఆనందం, శ్రేయస్సుకి చిహ్నంగా భావిస్తారు కేరళ వాసులు

ఇవి కూడా చదవండి

ఓనం పండుగను ఇలా జరుపుకుంటారు

ఓనం సందర్భంగా ఇంటి ఆవరణలో రంగురంగుల పూలతో అలంకరిస్తారు. ఈ అలంకరణ సాంప్రదాయ పెయింటింగ్స్ లేదా డిజైన్ల రూపాన్ని తీసుకుంటుంది,సాధారణంగా రంగురంగుల పువ్వులు, ఆకులు, పొడి బియ్యం పిండి వంటి వాటిని ఉపయోగించి అందమైన రంగ వల్లులు తీర్సిదిద్దుతారు.

ప్రత్యేక ఆహారం

ఓనం సందర్భంగా సద్య అనే ప్రత్యేకమైన ఆహారాన్ని తయారుచేస్తారు. ఇది అరటి ఆకుపై వడ్డించే సాంబార్ అన్నం.. పాయసం, కుట్టు, అవియల్, తయ్యర్ మొదలైన దాదాపు 26 రకాల ఆహార పదార్ధాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు.

సాంస్కృతిక కార్యక్రమాలు

సాంప్రదాయ కరేలియన్ కళ.. సంస్కృతిని ప్రతిబింబించే ‘తుల్లల్’ (జానపద నృత్యం), ‘కథకళి’ (క్లాసికల్ డ్యాన్స్), ‘పుట్టు’ (క్రీడలు) వంటి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఓనం సందర్భంగా జరుగుతాయి.

పడవ పందెం

ఓనం సమయంలో ‘నౌకా వల్లం’ లేదా బోట్ రేస్ నిర్వహించబడుతుంది, ఇందులో సాంప్రదాయ పడవ పందెం జరుగుతుంది. ఈ కార్యక్రమం పండుగలో చాలా ముఖ్యమైన భాగం.. అనేక స్థానిక పార్టీలు ఇందులో పాల్గొంటాయి.

గొప్ప అలంకరణ

ఇళ్లు , వీధులు రంగురంగుల బల్బులు, బట్టలు, అలంకరణ వస్తువులతో అలంకరింస్తారు. ముఖ్యంగా ఓనం సందర్భంగా ప్రతి ఇంట్లో ఆనందం, సంతోషం వెల్లివిరుస్తుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Note: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం, ఖచ్చితమైనది అని మేము ధృవీకరించడం లేదు. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి