Vinayaka Chavithi 2024: సంపత్ వినాయకుడి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం.. 9 రోజులు ఒకొక్క అలంకారంలో గణపతి దర్శనం
విశాఖపట్నంలోని ఆశీలు మెట్ట ప్రాంతంలో సంపత్ వినాయక ఆలయం లో వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి హోమం ప్రారంభమై. అభిషేకం చేశారు. తొమ్మిది రోజులపాటు రోజు ఒక ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తారు స్వామి వారు. రేపు నారాయణ సేవ. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు
అది విశాఖ నడిబొడ్డున ఉన్న అతి చిన్న గణనాథుడి ఆలయం. కానీ చాలా పవర్ఫుల్. కోరిన కోరికలు కచ్చితంగా ఆ స్వామి తీరుస్తాడని భక్తుల అపార నమ్మకం. అందుకే వివిధ రాష్ట్రాల నుంచి సైతం భారీగా స్వామివారిని దర్శించుకుంటారు. అదే విశాఖలోని సంపత్ వినాయక ఆలయం. వినాయక చవితి సందర్భంగా స్వామివారు భక్తుల నుంచి పూజలు అందుకుంటున్నారు.
విశాఖపట్నంలోని ఆశీలు మెట్ట ప్రాంతంలో సంపత్ వినాయక ఆలయం లో వరసిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున మూడు గంటల నుంచి స్వామివారి హోమం ప్రారంభమై. అభిషేకం చేశారు. తొమ్మిది రోజులపాటు రోజు ఒక ప్రత్యేక అలంకరణలో దర్శనం ఇస్తారు స్వామి వారు. రేపు నారాయణ సేవ. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ధార్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
సంపత్ వినాయక ఆలయం తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయ వైశాల్యం చాలా చిన్నగా ఉంటుంది. విశాఖనగర నడిబొడ్డున వెలసిన ఈ సంపత్ వినాయకుని దర్శించి, అర్చిస్తే సమస్యలు వెంటనే పరిష్కారమౌతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సకల విఘ్నాలను హరించి తనను కొలిచేవారికి సంపదలిచ్చే దేవుడిగా ఈ సంపత్ వినాయకుడు ప్రసిద్ధుడు. వినాయక చవితి ఉత్సవాల సమయంలోనే కాదు.. నిత్యం వేల సంఖ్యలో భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారు. ముఖ్యంగా బుధ, శుక్ర వారాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఇక పర్వదినాల్లో అయితే, ఈ ఆలయం భక్తజన సంద్రమే. కొత్త వాహనం కొనుగోలు చేస్తే కచ్చితంగా సంపద వినాయక ఆలయానికి తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. 1960 దశకం నుంచి భక్తులకు ఈ సంపత్ వినాయకుడు దర్శనమిస్తున్నాడని చెబుతున్నారు. స్వామివారిని, సకల సంపదలూ అనుగ్రహించే దైవంగా, వాస్తుదోషం నివారణకు అధిష్టాన దేవతగా భక్తులు ఆరాధిస్తారు.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..