AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Typhoon Yagi: చైనాని వదలని తుఫాన్లు.. యాగీ బీభత్సం.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు

చైనా శుక్రవారం పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. యాగీ తుపాను మొదట హైనాన్‌కు చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక జారీ చేశారు. దీని తర్వాత ఇది దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చేరుకుంది. ఇది చైనాలోని గ్వాంగ్జి జువాంగ్ ప్రాంతం.. ఉత్తర వియత్నాంకు చేరుకునే అవకాశం ఉంది. హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Typhoon Yagi: చైనాని వదలని తుఫాన్లు.. యాగీ బీభత్సం.. స్కూల్స్, కాలేజీలకు సెలవులు.. 10 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
Typhoon Yagi
Follow us
Surya Kala

|

Updated on: Sep 07, 2024 | 7:21 PM

చైనాలో ‘యాగీ’ తుపాను బీభత్సం సృష్టించింది. దక్షిణ చైనాలోని ద్వీప ప్రావిన్స్‌లోని హైనాన్ తీరంలో తుఫాను ప్రభావంతో భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ యాగీ తుఫాన్ వలన ఇద్దరు వ్యక్తులు మరణించారు. 92 మంది గాయపడ్డారు. స్థానిక అధికారులు ఈ ఏడాది చైనాలో ఏర్పడిన 11వ తుఫాను యాగీ అని చెప్పారు. ఈ తుఫాన్ శుక్రవారం చైనా తీరాన్ని తాకింది. ఇది మొదట హైనాన్‌ను తాకింది. ప్రస్తుతం ఇది గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చేరుకుంది.

చైనా శుక్రవారం పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. యాగీ తుపాను మొదట హైనాన్‌కు చేరుకోవడంతో దక్షిణ ప్రాంతంలో వరదల హెచ్చరిక జారీ చేశారు. దీని తర్వాత ఇది దక్షిణ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌కు చేరుకుంది. ఇది చైనాలోని గ్వాంగ్జి జువాంగ్ ప్రాంతం.. ఉత్తర వియత్నాంకు చేరుకునే అవకాశం ఉంది. హాంకాంగ్ సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. ప్రభావిత ప్రాంతాల నుండి 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇవి కూడా చదవండి

100కి పైగా విమానాలు రద్దు

యాగీ తుఫాన్ సృష్టించిన విధ్వంసం దృష్ట్యా హైనాన్ తీరంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. పాఠశాలలతో పాటు అన్ని వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. చైనాలో ఈ తుఫాను కారణంగా శుక్రవారం 100కి పైగా విమానాలు రద్దు చేశారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలలో కొబ్బరి చెట్లు నేలకూలడం.. భారీ చెట్లు పడిపోవడం చూడవచ్చు. ఎక్కడికక్కడ బిల్‌బోర్డ్‌లు పడిపోయాయి.. వాహనాలు బోల్తా పడ్డాయి. హైనాన్ వాతావరణ సేవ ప్రకారం టైఫూన్ యాగీ భూకంప కేంద్రానికి సమీపంలో గంటకు 245 కిమీ (152 mph) వేగంతో గాలులు వీస్తున్నాయి.

తుపాను డెల్టా నది వైపు కదులుతోన్న యాగీ తుపాను

చైనాను తాకిన ఈ భయంకరమైన తుఫాను విధ్వంసం శుక్రవారం సాయంత్రం 4 గంటలకు వెన్‌చాంగ్‌కు చేరుకుంది. 1949 నుండి 2023 వరకు.. ఇప్పటివరకు 106 తుఫానులు సంభవించాయి. అయితే వీటిలో తొమ్మిది మాత్రమే సూపర్ టైఫూన్‌లుగా జాబితా చేర్చబడ్డాయి. అంటే తుఫానులు భారీ విధ్వంసం కలిగిస్తాయి.

గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్షియల్ గవర్నర్ వాంగ్ వీజోంగ్ యాగీకి గురించి మాట్లాడుతూ అధికారులకు తుఫాన్ వలన తీవ్ర నష్టం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పారు. తుఫాన్ ప్రభావాన్ని నివారించడానికి ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టవద్దని సూచించారు. ఈ క్లిష్ట పోరులో కచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ తుఫాను పశ్చిమ గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ , పెరల్ రివర్ డెల్టా వైపు కదులుతోంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..