AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sweden: పిల్లల ఆరోగ్యం కోసం ఆ దేశం సంచలన నిర్ణయం.. టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు వాడకంపై..

స్వీడిష్ ప్రభుత్వ సలహా ప్రకారం రెండు నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు గరిష్టంగా ఒక గంట పాటు స్క్రీన్‌లను ఉపయోగించవచ్చు. అయితే ఆరు నుండి 12 సంవత్సరాల వయస్సు పిల్లలు కేవలం రెండు గంటలు మాత్రమే స్క్రీన్‌లను ఉపయోగించవచ్చు. టీనేజర్లు రోజుకు మూడు గంటలు మాత్రమే స్క్రీన్‌లను ఉపయోగించాలని పేర్కొంది.

Sweden: పిల్లల ఆరోగ్యం కోసం ఆ దేశం సంచలన నిర్ణయం.. టీవీ, స్మార్ట్‌ఫోన్‌లు వాడకంపై..
Sweden Bans Cell Phones
Surya Kala
|

Updated on: Sep 07, 2024 | 8:05 PM

Share

ఇప్పుడు పిల్లలు పుడుతూనే సెల్ అంటున్నారు. వయసు తో సంబంధం లేకుండా సెల్ ఫోన్లతోనే లోకంగా బతికేస్తున్నారు అని చెప్పవచ్చు. అయితే స్వీడన్ దేశం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. స్వీడన్‌లో పిల్లలకు సంబంధించి పెద్ద చర్చ జరుగుతోంది. రెండు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు స్క్రీన్‌లను ఉపయోగించడం నిషేధించబడింది. దీంతో పిల్లలు ఇకపై స్క్రీన్‌ని ఉపయోగించలేరు. పిల్లలు టీవీ, మొబైల్ ఫోన్లు సహా ఎలాంటి స్క్రీన్‌లను ఉపయోగించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు ప్రభుత్వం జారీ చేసింది.

స్వీడిష్ ప్రభుత్వ సలహా ప్రకారం రెండు నుండి ఐదు సంవత్సరాల వయస్సు గల పిల్లలు రోజుకు గరిష్టంగా ఒక గంట పాటు స్క్రీన్‌లను ఉపయోగించవచ్చు. అయితే ఆరు నుండి 12 సంవత్సరాల వయస్సు పిల్లలు కేవలం రెండు గంటలు మాత్రమే స్క్రీన్‌లను ఉపయోగించవచ్చు. టీనేజర్లు రోజుకు మూడు గంటలు మాత్రమే స్క్రీన్‌లను ఉపయోగించాలని పేర్కొంది.

నిద్రపై స్క్రీన్ వాడకం ప్రభావం

ఎక్కువ స్క్రీన్ వినియోగం వలన పిల్లలు, యుక్తవయస్కుల నిద్రను ప్రభావితం చేస్తుందని అనేక పరిశోధనా సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో స్వీడిష్ ప్రభుత్వం ఈ సలహాను జారీ చేసింది. డిప్రెషన్ కేసులు పెరుగుతున్నాయి. శారీరక శ్రమ స్థాయి కూడా నిరంతరం తగ్గుతోంది. ఆరోగ్య పరంగా ఏది మంచిది కాదు. ఇది నేరుగా పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది.

ఇవి కూడా చదవండి

ఫ్రాన్స్‌లో కూడా స్క్రీన్‌ల ఉపయోగంపై నిషేధం

అమెరికా, ఐర్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ వంటి దేశాలు ఇప్పటికే పిల్లలకు సంబంధించి ఇటువంటి సలహాలను జారీ చేశాయి. వీటిలో ఫ్రెంచ్ ప్రభుత్వం కఠినమైన ఉత్తర్వులను జారీ చేసింది. ఫ్రాన్స్‌లో మూడేళ్లలోపు పిల్లలు స్క్రీన్‌లను అస్సలు ఉపయోగించకూడదని చెప్పారు.

‘పిల్లలను స్క్రీన్‌లకు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం’

వాస్తవానికి కొద్ది రోజుల క్రితం స్వీడిష్ ప్రభుత్వం 18 ఏళ్లలోపు పిల్లలకు స్క్రీన్‌లను చూడటానికి కొత్త సిఫార్సులను తీసుకువచ్చింది. ఇందులో పిల్లలను స్క్రీన్‌పై చూడనివ్వకూడదని తల్లిదండ్రులకు స్పష్టంగా చెప్పింది. రెండేళ్లలోపు పిల్లలను డిజిటల్ మీడియా, టెలివిజన్‌లకు పూర్తిగా దూరంగా ఉంచడం చాలా ముఖ్యమని ఆరోగ్య సంస్థ తెలిపింది. ఆరోగ్య మంత్రి జాకబ్ ఫోర్స్మెడ్ ఈ విషయంపై మాట్లాడుతూ గంటల తరబడి స్క్రీన్‌లను చూడటం వల్ల పిల్లలకు తగినంత నిద్ర రాదు. అటువంటి పరిస్థితిలో స్క్రీన్ నుంచి పిల్లల్ని దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

మరిని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..