Russia-Ukraine Conflict: భారత్.. రష్యా-ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరిస్తుంది.. ఇటలీ ప్రధాని మెలోని కీలక వ్యాఖ్యలు..
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది.. వందలాది మిస్సైళ్లు, డ్రోన్లతో ఉక్రెయిన్, రష్యా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి.. ఇప్పటికే ఇరువైపులా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. వేలాది మంది చనిపోయారు. అయినప్పటికీ దాడులు మాత్రం ఆగడం లేదు.. ఈ క్రమంలోనే.. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. శనివారం ఉత్తర ఇటలీలోని సెర్నోబియో నగరంలోని అంబ్రోసెట్టి ఫోరమ్‌లో శనివారం మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు. ఫొరంలో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం గురించి మాట్లాడిన మెలోని ఆవేదన వ్యక్తంచేశారు. రష్యా – ఉక్రెయిన్ మధ్య వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా వంటి దేశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు. ఇప్పటికే భారత్ ఈ విషయంలో స్పందించిందని గుర్తుచేశారు.
అంబ్రోసెట్టి ఫోరమ్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీతో శనివారం మెలోని సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రస్తుత సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేసిన 48 గంటల తర్వాత మెలోని ఈ వ్యాఖ్యలు చేయడం ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
‘‘అంతర్జాతీయ చట్టం నియమాలు ఉల్లంఘించడం వల్ల గందరగోళం, సంక్షోభం లాంటి పరిస్థితులు ఎదురవుతాయని దీంతో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ సంక్షోభంతో భౌగోళిక-ఆర్థిక స్థలం సహజ విభజన ఉంటుంది.. దీర్ఘకాలంలో, ఆర్థిక ప్రపంచీకరణ, అంతర్జాతీయ చట్టం నియమాలను ప్రశ్నించడం కలిసి నడవదని నేను కూడా నా చైనీస్ సహచరులకు చెప్పాను, మనం తప్పక ఎంచుకోవాలి.. ఎందుకంటే రెండు విషయాలు కలిసి ఉండవు. ఇది కూడా కారణం. ఉక్రెయిన్‌లో వివాదాన్ని పరిష్కరించడంలో చైనా, భారతదేశం వంటి అంతిమ దేశాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని.. ఆ దిశగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను’’ అంటూ జార్జియా మెలోని పేర్కొన్నారు.
గురువారం, వ్లాడివోస్టాక్‌లో జరిగిన 9వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రసంగిస్తూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య సమస్యను పరిష్కరించడంలో భారతదేశం పాత్రను, సహాయ హస్తం అందించడంలో కీలకంగా వ్యవహరించిన తీరు గురించి ప్రస్తావించారు.
“వివాదానికి సంబంధించిన (ఉక్రెయిన్‌తో) అన్ని సమస్యలను పరిష్కరించడంలో.. చిత్తశుద్ధితో ఉన్న మా స్నేహితులు, భాగస్వాములను మేము గౌరవిస్తాము. ఈ దేశాల నాయకులు, మేము ఒకరితో ఒకరు విశ్వాసం.. విశ్వాసంతో కూడిన సంబంధాలను కలిగి ఉన్నాము.. సహాయం అందించడంలో నిజంగా ఆసక్తి చూపుతాము” అని పుతిన్ భారతదేశం గురించి మాట్లాడుతూ పేర్కొన్నారు.
ఇటీవల రష్యా, ఉక్రెయిన్ లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. యుద్ధాన్ని ఆపాలని.. చర్చల ద్వారా ఇరువురు పరిష్కరించుకోవాలని ఇరు దేశాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శనివారం నాడు అంబ్రోసెట్టి ఫోరమ్‌లో జెలెన్స్కీతో సమావేశం జరిగిన తర్వాత మెలోని ఈ వ్యాఖ్యలు చేశారు.
Watch: Italian Prime Minister Giorgia Meloni, speaking at the 50th edition of The European House – Ambrosetti Forum in Cernobbio, northern Italy, says, “It is obvious that if the rules of international law are broken we will get a multiplication of chaos and crisis, but it is… pic.twitter.com/A1R5uLARKI
— IANS (@ians_india) September 7, 2024
మెలోని.. వోలోడిమిర్ జెలెన్స్కీ.. ఇద్దరు కూడా ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. తాజా పరిణామాలు, శీతాకాలానికి ముందు ఉక్రెయిన్ దేశానికి అందించాల్సిన అత్యవసర అవసరాల గురించి చర్చించారు.సైనిక, సాంకేతిక సహాయ ప్యాకేజీలకు ఉక్రెయిన్ దేశాధినేత కృతజ్ఞతలు తెలిపారు. ఉక్రెయిన్ పునరుద్ధరణ, ఇటాలియన్ G7 ప్రెసిడెన్సీ ఎజెండాలో ఉక్రెయిన్‌కు మద్దతు అత్యంత ప్రాధాన్యత అని మెలోనీ పునరుద్ఘాటించారని, ఉక్రెయిన్, చట్టబద్ధమైన రక్షణ, న్యాయమైన డిమాండ్లు, శాశ్వత శాంతి కోసం కొనసాగుతున్న నిబద్ధతను పునరుద్ఘాటించారని ఇటాలియన్ PM కార్యాలయం పేర్కొంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..