చేపలు తినేవారు జాగ్రత్త! క్యాన్సర్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం పొంచివుంది..!
ఇప్పుడు చేపలు కూడా విషపూరితంగా మారుతున్నాయి. సరస్సులు, నదుల్లోని నీరు ఎంతగానో కలుషితమైందని, అందులో నివసించే చేపలు ఇప్పుడు విషపూరితంగా మారుతున్నాయని ఓ అధ్యయనంలో తేలింది.
మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్నిమాత్రమే తీసుకోవాలని భావిస్తున్నట్టయితేన..చేపలు మంచి ఎంపిక. ఎందుకంటే చేపల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. అసంతృప్త కొవ్వు తక్కువగా ఉంటుంది. ఇందులో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, అనేక ఇతర పోషకాలు కూడా ఉన్నాయి. అయితే చేపలు తినడానికి ఇష్టపడే వారు ఈ వార్త వింటే షాక్ అవుతారు. చేపలను తిన్నప్పటికీ అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ, US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ సంయుక్త అధ్యయనంలో వెల్లడైన విషయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరస్సులు, నదులలోని నీరు అత్యంత కలుషితమైందని తేలింది. వీటిలో నివసించే చేపలు ఇప్పుడు విషపూరితంగా మారుతున్నాయి. వీటిల్లో చేపలలో 278 ఫరెవర్ కెమికల్ రసాయనం కనుగొనబడిందని అధ్యయనం తెలిపింది. ఇది తీవ్రమైన వ్యాధులకు దారి తీస్తుంది.
ఫరెవర్ కెమికల్ అంటే ఏమిటి ? దీన్నే.. ఫరెవర్ కెమికల్‌ని పర్-అండ్-పాలీఫ్లోరోఅల్కైల్ పదార్ధం అని కూడా అంటారు. ఇది గొడుగులు, రెయిన్‌కోట్లు, మొబైల్ కవర్లు వంటి వాటర్ ఫ్రూవ్ వస్తువుల్లో సాధారణంగా ఉపయోగించే రసాయనం. ఈ రసాయనం హార్మోన్లు, పెరుగుదలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీని వల్ల థైరాయిడ్, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వస్తాయి. ఫరెవర్ కెమికల్ స్త్రీలు గర్భస్రావం అయ్యేలా, లేదంటే గడువు తేదీకి ముందే ప్రసవించేలా చేస్తుంది. దీని వల్ల వారి పిల్లల శరీరం, మనస్సు సరిగా అభివృద్ధి చెందవు. 2017లో ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ PFOAని హ్యూమన్ కార్సినోజెన్‌గా పేర్కొంది. అంటే క్యాన్సర్, మూత్రపిండ, వృషణ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
వేల రెట్లు ఎక్కువ రసాయన గుర్తింపు.. అమెరికాలోని నదులు, సరస్సులలో 3 సంవత్సరాల పరిశోధన తర్వాత, ఈ రసాయనం జంతువులలో 2,400 రెట్లు ఎక్కువగా రావడం ప్రారంభించినట్లు కనుగొనబడింది. ఉదాహరణకు , నెలకు ఒకసారి చేపలు తినడం అంటే మీరు నెల పొడవునా బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో నిండిన నీటిని తాగుతున్నారని అర్థం. ఈ నమూనా ఒకటి కాదు 48 US రాష్ట్రాల్లో కనుగొనబడింది.
మరిన్ని ఆరోగ్య సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..