Viral Video: ఎవర్రా మీరంతా.. పీఠై పరాఠా పేరుతో కుంభీపాకం చేసేస్తున్నాడు.. చూస్తేనే.. దేవుడా..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jan 24, 2023 | 11:37 AM

వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి దీనికి 36.8M వీక్షణలు, 882K లైక్‌లు, వేలకొద్దీ కామెంట్‌లు వచ్చాయి. ఆ వ్యక్తి పరాఠాను కొట్టిన తీరుతో ఇంటర్నెట్ వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. పిట్టై పరాఠా పేరుతో కుంభీపాకం చేశావ్  బాయ్ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. 

Viral Video: ఎవర్రా మీరంతా.. పీఠై పరాఠా పేరుతో కుంభీపాకం చేసేస్తున్నాడు.. చూస్తేనే.. దేవుడా..
Pitai Paratha

నెయ్యి పోసిన పరాఠాతో బ్రేక్‌ఫాస్ట్‌ మొదలుపెట్టడం అంటే చాలా మంది భోజన ప్రియులు స్వర్గాన్ని తాకినట్టుగా ఫీలవుతారు. చాలా వరకు పిండి పదార్థాలు నెయ్యి, నూనెలతో తయారు చేసినవాటిని ఎక్కువగా తినటానికి ఇష్టపడుతుంటారు జనాలు. పరాఠా, పూరీ వంటివి భారతీయులకు ఆల్ టైమ్ ఫేవరెట్ బ్రేక్ ఫాస్ట్ డిష్‌గా చెప్పాలి. వీటి తయారీ ఎక్కువగా సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తయారు చేస్తుంటారు. బంగాళాదుంప, పనీర్ కూడా పరాఠాలో వినియోగిస్తుంటారు. ఇది అద్భుత కాంబినేషన్‌గా ఆస్వాదిస్తుంటారు. చోలే, దాల్ మఖానీ, ఏదైనా ఇతర కూరలతో పరాఠాను ఆస్వాదిస్తుంటారు. అలాంటి భోజన ప్రియులు సులభంగా తయారు చేసుకునేలా.. ఓ విధి వ్యాపారి తయారు చేసిన పరాఠా స్టైల్‌ ఇప్పుడు నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది. కోల్‌కతా స్ట్రీట్ ఫుడ్ విక్రేత పరాఠాలను తయారు చేసిన విదానం చూస్తే.. మీరు కూడా షాక్ అవుతారు..అదేంటో చూసేయండి మరీ..!

@foodfatafat ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది వీధి వ్యాపారి పరాఠాను తయారు చేస్తున్న విధానాన్ని చూపిస్తుంది. వీడియోలో అతను పిండిని సిద్ధం చేస్తున్న విధానం చూసి నెటిజన్లు భయపడిపోతున్నారు. వేడివేడి పొగలు గక్కుతున్న ఆ పెనం మీద పిండి ముద్దను పదే పదే కొడుతూ బీభత్సం సృష్టిస్తున్నాడు. అంతటి వేడిమీద అతడి చేతుల్లోనే పరాఠా చిత్తు చిత్తుగా తయారు చేస్తుండటం నిజంగానే షాకింగ్‌గా ఉంది. అందుకే దీన్ని పిటై పరాటా (కొట్టిన పరాటా) అని పిలవడానికి కారణం. ఈ రుచికరమైన వంటకం అందరికీ నచ్చేలా చేసే వింత విధానం ఇదేనంటున్నారు కొందరు నెటిజన్లు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఈ విచిత్రమైన వంటకానికి చూసిన చాలా మంది ప్రజలు ప్రతిస్పందిస్తున్నారు. అన్ని వేళ్లు భిన్నంగా ఉన్నట్టుగానే, వ్యక్తులు వారివారి సొంత సామర్థ్యం, అభిప్రాయాలను కలిగి ఉంటారు. ఇది చాలా మందికి దిగ్భ్రాంతిని కలిగించేలా ఉంటే, మరికొందరు హాస్యాస్పదంగా ఉందంటున్నారు. కానీ కొందరు అతడు తయారు చేసిన ఆహారం పట్ల గౌరవం వ్యక్తం చేస్తున్నారు. వినియోగదారుల్లో ఒకరు.. ‘పరాఠాను తయారు చేయడానికి ఇది సరైన మార్గం అని ఎవరికీ తెలియదు అంటున్నారు. వీడియో అప్‌లోడ్ చేసినప్పటి నుండి దీనికి 36.8M వీక్షణలు, 882K లైక్‌లు, వేలకొద్దీ కామెంట్‌లు వచ్చాయి. ఆ వ్యక్తి పరాఠాను కొట్టిన తీరుతో ఇంటర్నెట్ వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. పిట్టై పరాఠా పేరుతో కుంభీపాకం చేశావ్  బాయ్ అంటూ మరికొందరు ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu