పరువు హత్య కలకలం.. కొత్తగా పెళ్లయిన కూతురిని కోర్టులోనే కాల్చిచంపిన తండ్రి..

Jyothi Gadda

Jyothi Gadda |

Updated on: Jan 24, 2023 | 10:54 AM

వివిధ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వందలాది మంది మహిళలు పరువు పేరుతో హత్యలకు గురవుతున్నారు. చాలా వరకు ఇలాంటి కేసులు బయటపడకపోవటంతో.. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

పరువు హత్య కలకలం.. కొత్తగా పెళ్లయిన కూతురిని కోర్టులోనే కాల్చిచంపిన తండ్రి..
Gun Firing

పాకిస్తాన్ కరాచీలో దారుణ ఘటన చోటు చేసకుంది. కోర్టు ఆవరణలోనే జరిగిన పరువు హత్య కలకలం రేపింది. పెళ్లైన యువతిని కోర్టు హాలులోనే ఆమె తండ్రి కాల్చి చంపాడు. కొత్తగా పెళ్లయిన తన కుమార్తెను ఓ తండ్రి కాల్చిచంపటంతో అందరూ నిర్ఘాంతపోయారు. పోలీసులు పరువు హత్య కేసుగా పేర్కొన్నారు. కరాచీలోని పిరాబాద్‌లో నివాసముంటున్న మహిళ తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు కరాచీ సిటీ కోర్టుకు వచ్చిన క్రమంలోనే ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. బాధిత యువతి తన ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నట్లు కోర్టుకు తెలిపింది. ఆ మహిళ గిరిజన ప్రాంతంలోని వజీరిస్థాన్‌లో నివాసం ఉండేదని, ఇటీవలే ఆమె పొరుగున ఉన్న డాక్టర్‌ని వివాహం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ షబ్బీర్ సేథర్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఈ ఉదయం సిటీ కోర్టుకు వచ్చినప్పుడు, ఆమె తండ్రి ఆమెపై కాల్పులు జరిపినట్టుగా పేర్కొన్నారు. దాంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఒక పోలీసు అధికారికి కూడా గాయలైనట్టుగా చెప్పారు. స్థానికులు తృటిలో ప్రమాదం నుండి తప్పించున్నట్టుగా చెప్పారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేశామని, నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

పెళ్లి తర్వాత మహిళ ఇంటి నుంచి వెళ్లిపోయిందని, దీంతో ఆమె తండ్రి ఆగ్రహం వ్యక్తం చేశారని పోలీసులు తెలిపారు. పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ప్రతి సంవత్సరం వందలాది మంది మహిళలు పరువు పేరుతో హత్యలకు గురవుతున్నారు. హ్యూమన్ రైట్స్ కమీషన్ ఆఫ్ పాకిస్తాన్ (HRCP) గత దశాబ్దంలో సంవత్సరానికి సగటున 650 పరువు హత్యలను నివేదించింది. అయితే చాలా వరకు ఇలాంటి కేసులు బయటపడకపోవటంతో.. వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu