AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మెట్రోలో ప్రత్యక్షమైన మంజూలిక.. యువతి గెటప్‌ చూసి హడలెత్తిపోయిన ప్రయాణికులు..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వైర‌ల్ వీడియోలో మంజూలిక‌గా త‌యారైన యువతి మెట్రో కంపార్ట్‌మెంట్‌లో క‌లియ‌తిర‌గ‌డం చూసి నెటిజన్లు సైతం షాక్ కు గురవుతున్నారు.

Viral Video: మెట్రోలో ప్రత్యక్షమైన మంజూలిక.. యువతి గెటప్‌ చూసి హడలెత్తిపోయిన ప్రయాణికులు..
Manjulika
Jyothi Gadda
|

Updated on: Jan 24, 2023 | 1:30 PM

Share

చంద్రముఖి సినిమాలో జ్యోతిక క్యారెక్టర్‌ అందిరికీ గుర్తిండే ఉంటుంది. ఎందుకంటే.. విచిత్ర వేషధారణలో కనిపించిన ఆమె రూపంలో అప్పట్లో చాలా మందిని భయపెట్టింది. అలాగే, బాలీవుడ్ థ్రిల్ల‌ర్ మూవీ భూల్ భుల‌య్య‌లో మంజూలిక క్యారెక్ట‌ర్ ప్రేక్ష‌కుల్ని భ‌య‌పెట్ట‌గా తాజాగా మెట్రో రైల్‌లో మంజూలిక వేష‌ధార‌ణ‌లో ఓ మ‌హిళ హ‌ల్చ‌ల్ చేసింది. అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన భూల్ భూలయ్యా చిత్రంలో విద్యాబాలన్ పోషించిన ఐకానిక్ క్యారెక్టర్‌ని మంజులిక వేషాన్ని ఒక అమ్మాయి ధరించింది. ఆ అమ్మాయి మెట్రోలో ప్రయాణీకులను భయపెట్టడానికి ట్రై చేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వైర‌ల్ వీడియోలో మంజూలిక‌గా త‌యారై మెట్రో కంపార్ట్‌మెంట్‌లో క‌లియ‌తిర‌గ‌డం క‌నిపిస్తుంది.

ఆమె స్టేజ్‌పై ఇలా చేసి ఉంటే మంచి న‌టిగా పేరు వ‌చ్చేద‌ని, థియేట‌ర్ల‌లో డ్రామా పండించ‌వ‌చ్చుకానీ..నిజ‌ జీవితంలో కాద‌ని ఓ యూజ‌ర్ రాసుకొచ్చారు. అస‌లు ఈమె సెక్యూరిటీ కళ్లుగప్పి మెట్రో రైల్‌లోకి ఎలా ఎంట‌రైంద‌ని మ‌రో యూజ‌ర్ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ విచిత్రమైన సంఘటనలో నోయిడా నుండి గ్రేటర్ నోయిడా వెళ్తున్న మెట్రో రైళ్లో చోటు చేసుకుంది.

మంజూలిక గెటప్‌లో మెట్రోలో హఠాత్తుగా ఆ అమ్మాయి ప్రత్యక్షం కావటంతో…. ఆమె రూపం చూసి ప్రయాణికులు కూడా భయపడిపోయారు. ఈ అమ్మాయి తమపై దాడి చేస్తుందని హడలెత్తిపోయారు. అయితే ఆమె ఇదంతా ఏదో సరదా కోసమే, వైరల్‌ వీడియో కోసం చేస్తుందని తెలియడంతో అందరూ అదరూ ఊపిరిపీల్చుకున్నారు. . ఇంతలో కొందరు ప్రయాణికులు మంజులిక చేసిన డ్యాన్స్‌ను తమ మొబైల్‌ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?