Bathing Mistakes: వేళాపాళా లేకుండా ఎప్పుడంటే అప్పుడు స్నానం చేస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి
చాలా మందికి రోజూ స్నానం చేసే అలవాటు ఉండదు. ఇంకొంత మంది అయితే రోజు మూడు, నాలుగు సార్లు స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం నిజంగానే శుభ్రంగా ఉంటుందా? వేడి నీటితో స్నానం చేసిన తర్వాత శరీరంలోని అలసట అంతా పోతుందా? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి..
చాలా మందికి రోజూ స్నానం చేసే అలవాటు ఉండదు. ఇంకొంత మంది అయితే రోజు మూడు, నాలుగు సార్లు స్నానం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చర్మం నిజంగానే శుభ్రంగా ఉంటుందా? వేడి నీటితో స్నానం చేసిన తర్వాత శరీరంలోని అలసట అంతా పోతుందా? వంటి అనుమానాలు చాలా మందికి ఉంటాయి. నిజానికి, మనలో చాలా మంది తెలిసో.. తెలియకో.. స్నానం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. ఇది శరీరానికి, చర్మానికి హాని కలిగిస్తుంది. స్నానం చేసేటప్పుడు చేయకూడదని తప్పులు ఇవే..
ఎప్పుడంటే అప్పుడు స్నానం చేయవద్దు
మీకు కావలసినప్పుడు స్నానం చేయవద్దు. అంటే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఇలా వేళాపాలా లేకుండా వేర్వేరు సమయాల్లో స్నానం చేయడం మంచి పద్ధతి కాదు. వేడి వాతావరణంలో రోజుకు రెండు లేదా మూడు సార్లు స్నానం చేయాలి. అయితే వేడిగా ఉన్నప్పుడు మాత్రం అస్సలు స్నానం చేయకూడదు. కాసేపు ఫ్యాన్ కింద కూర్చొని శరీరం చల్ల బడిన తర్వాత, స్నానం చేయాలి. ఇది శరీర సమస్యల బారీన పడే అవకాశాన్ని తగ్గిస్తుంది.
నీటి ఉష్ణోగ్రత
వేసవిలో చల్లని నీరు, శీతాకాలంలో వేడి నీళ్ల స్నానం మనసుకు హాయినిస్తుంది. కానీ చాలా చల్లటి లేదా చాలా వేడి నీటిలో స్నానం ఎట్టి పరిస్థితుల్లోనూ చూయకూడదు. అధికంగా వేడిగా ఉండే నీటిలో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది. దీని వల్ల చర్మంపై ఉండే సహజ నూనెలు తొలగిపోతాయి. ఇన్‌ఫ్లమేషన్ పెరుగుతుంది. దురద సమస్య వృద్ధి చెందుతుంది. అందుకే వర్షాకాలంలో, చలికాలంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయడానికి ప్రయత్నించాలి.
లూఫా వినియోగం
బాడీ వాష్, షవర్ జెల్ లేదా సబ్బు-ఏదైనా అప్లై చేయడానికి లూఫా వినియోగించాలి. లూఫాతో సబ్బును అప్లై చేయడం వల్ల చర్మంలోని మృతకణాలు, మురికి తొలగిపోతాయి. ఇంట్లో ఒకే లూఫా లేదా మెష్‌ని అందరూ ఉపయోగించవద్దు. బాత్రూంలో తడి లూని అలాగే వదిలేయ కూడదు. తడి లూఫా అనేక సూక్ష్మక్రిములకు సంతానోత్పత్తి ప్రదేశం. వాడిన తర్వాత నెట్‌ను ఎండలో ఆరబెట్టాలి.
టవల్
తడి టవల్‌తో తలను తుడిచిన తర్వాత ఆరుబయట ఆరనివ్వాలి. ఈ తప్పు అస్సలు చేయకూడదు. తడి వాష్‌క్లాత్ లేదా టవల్ తుడిచిన వెంటనే ఆరబెట్ట కూడదు. ముందుగా ఆ తడి టవల్ ను బాగా ఉతకాలి. తరువాత దానిని ఆరబెట్టండి. తడి వాష్‌క్లాత్‌లు లేదా టవల్‌లు దుర్వాసనను కలిగిస్తాయి. అలాగే బ్యాక్టీరియా, ఫంగస్‌ను వృద్ధి చేస్తాయి.